• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

రొమాంటిక్ కథ: 50పెళ్లిళ్లు చేసుకున్న కి'లేడీ' కేరళకుట్టి

By Srinivas
|

Cops hunt for woman who married 50 ment
చెన్నై: ఒకటి కాదు రెండు కాదు దాదాపు యాభై వరకు పెళ్లిళ్లు చేసుకుని మగాళ్లను మోసం చేస్తున్న ఓ కేరళ కుట్టి కోసం చెన్నై పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. కేరళలోని తిరువనంతపురానికి చెందిన షహనాజ్ నిత్య పెళ్లి కూతురు అవతారమెత్తి మగాళ్ల నుండి లక్షల వరకు వసూలు చేసి ఆ తర్వాత వారికి తెలియకుండా వదిలి వెళుతోంది. తన హొయలతో చాలామంది మగాళ్లను ఈ అమ్మడు వలలో వేసుకుంది. యువకుల గుండెల్లో కుంపట్లు పెట్టి ఇప్పుడు పోలీసులను పరుగు పెట్టిస్తోంది.

షహనాజ్ గత కొంతకాలంగా చెన్నైలో ఉంటోంది. చెన్నై నగరంలోనే ఏడుగురుకి పైగా యువకులు ఆమెపై వివిధ పోలీసు స్టేషన్‌లలో ఫిర్యాదు చేశారు. తవ్వి తీస్తే ఆమె దాదాపు యాభై వరకు పెళ్లిళ్లు చేసుకొని వారిని మోసగించి ఉంటుందని అనుమానిస్తున్నారు. చెన్నైలో ఉంటున్న మణికంఠకు షహనాజ్‌తో పరిచయం అయింది. అది స్నేహంగా.. ఆ తర్వాత ప్రేమగా మారింది. అతనితో కలిసి కొన్ని నెలలు ఉంది. ఆ తర్వాత లాకోర్సు అని, సివిల్ ఎక్సామ్స్ అని చెప్పి ఉమెన్ హాస్టల్‌లో చేరింది. ఆమె కోసం మణికంఠ రెండు లక్షల రూపాయాలకు పైగా ఖర్చి పెట్టాడు.

కొద్ది రోజుల తర్వాత షహనాజ్ ఉమెన్ హాస్టల్‌ నుండి అదృశ్యమైంది. గత సంవత్సరం నవంబరు నుండి ఆమె కనిపించకుండా పోయింది. దీంతో ఇతను అడియార్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అయితే ఆమె మిస్ కాలేదని, మిస్ అనేది షహనాజ్ తన వద్ద డబ్బులు పట్టించి ప్రీ ప్లాన్డ్‌గా మిస్ అయిందని ఆలస్యంగా తెలుసుకున్నాడు. సురేష్ అనే వ్యక్తి కూడా ఇదే రకంగా షహనాజ్ చేతిలో మోసపోయాడు. అతను మరో స్టేషన్‌లో ఆమెపై ఫిర్యాదు చేశాడు.

చివరగా ఆమె ప్రసన్న అనే ఫుట్‌బాల్ ప్లేయర్‌తో ప్రేమాయణం నడిపి.. ఆ తర్వాత పెళ్లి చేసుకుంది. ఇది తెలుసుకున్న పోలీసులు ప్రసన్నను అదుపులోకి తీసుకొని విచారించారు. అయితే అందరిలాగే తాను కూడా ఆమె చేతిలో మోసపోయానని అతను పోలీసుల ఎదుట నీరుగారిపోయాడు. ప్రసన్న తర్వాత ఆమె ఎవరిని వలలో వేయడానికి వెళ్లిందో తెలుసుకునే పనిలో పోలీసులు పడ్డారు.

ఇప్పుడు ఈ షహనాజ్ చెన్నై పోలీసులకు మోస్ట్ వాంటెడ్‌గా మారింది. తీవ్రంగా గాలిస్తున్నారు. నిత్య పెళ్లి కూతురులా మారిన షహనాజ్ తెలుగు, తమిళం, కన్నడం, హిందీ, ఇంగ్లీష్‌లలో అనర్గళంగా మాట్లాడగలదట. అందుకే ఎక్కడకు వెళ్లినా అక్కడి వారిని వీజీగా బుట్టలో పడేస్తుందని భావిస్తున్నారు. వ్యాపారవేత్తలు, ఉద్యోగస్తులే ఆమె టార్గెట్ అని పోలీసులు గుర్తించారు.

English summary
A marriage is said to be a bond of a lifetime. Not for Shahanaz, who has overnight become the woman most wanted by Chennai police for having married more than a dozen men and disappearing with their money in the past few months.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X