ప్రముఖ సాహితీవేత్త గౌతంరావు కన్నుమూత

'అర్థం చెడకుండా పఠించడం మా నాయన నేర్పిన విద్య. మిగిలినది కంఠం యొక్క ఆకర్షణ. అది దైవికంగా సంక్రమించింది. అనుభూతి లక్షణం తప్పకుండా ఉంటుంది..' అన్నది గౌతంరావు మాట. అంతే కాదు ఆయన అద్భుతంగా భావయుక్తంగా కవితావేశంతో గానం చేస్తే విన్నవారందరికీ కొత్త 'ఎరుక' కలుగుతుంది. తెలుగు పద్యంలోని అందాలు, శక్తి వినేవాళ్ళకు ప్రస్ఫుటంగా అర్థమవుతుంది. కాని కవిత్వంపై గౌతంరావుగారిది స్పష్టమైన అభిప్రాయం.
'కవిత్వంలో బలం ఉండాలి గాని పద్యమా ... వచనమా అన్నది కాదు...' సూటిగానూ, స్పష్టంగానూ తమ అభిప్రాయాలు ప్రకటించే గౌతంరావు గారిలో అంతే స్థాయిలో విశ్లేషణ, విమర్శ కూడా ఉండేది. చాలా విషయాలు స్పష్టంగా విశ్లేషించి వివరించే లక్షణం ఆయనది. కవితాపఠనమే కాదు మామూలుగా మాట్లాడినా గొప్ప భావుకత్వం కూడిన వ్యక్తీకరణ ఆయనది. ఆయన తన జీవితాన్ని నడిపించిన తీరు ఆయన తీర్చుదిద్దుకున్న శైలి వైవిధ్యంగా కనిపిస్తాయి.
స్వాతంత్య్ర పోరాటంలో యోధుడిగా పని చేసిన ఆయన సోషలిస్టుగా పరిణతి చెందారు. ప్రగతిగామిగా ఉంటూనే విశ్వనాథ రామాయణ కల్పవృక్షానికి, విశ్వనాథకు భక్తుడిగా మారాడు. ప్రేమతో విశ్వనాథుని తన హృదయంలో దాచుకొని ఆ స్కూల్ ఆఫ్ థాట్‌కు తనను తాను పరిమితం చేసుకున్నాడు. రాజకీయాలంటే ఇష్టం లేకుండానే ఎన్నికల్లో జనతా పార్టీ పక్షాన 1977లో పోటీ చేశారు. 'ఓడిపోతే ఫర్వాలేదు కాని గెలిస్తేనే కష్టం ... ఐమాయ్ నాట్ క్రౌడెడ్ లైఫ్...' అన్న ఆయన తన జీవితంలోనే కాదు సాహిత్యంలో కూడా అంతర్ముఖుడిగా ఉండిపోయారు.












Click it and Unblock the Notifications