వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్టీఆర్ విగ్రహం: టిడిపిపై పురంధేశ్వరి నెపం, ఫ్యామిలీలో

By Srinivas
|
Google Oneindia TeluguNews

Daggupati Purandeswari
న్యూఢిల్లీ: పార్లమెంటు ఆవరణలో స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహం ఏర్పాటును అడ్డుకున్నది తెలుగుదేశం పార్టీయేనని ఎన్టీఆర్ కూతురు, కేంద్రమంత్రి దగ్గుపాటి పురంధేశ్వరి సోమవారం ఆరోపించారు. విశాఖలో విమానాల నైట్ ల్యాండింగ్‌కు కేంద్రం అనుమతించిన సందర్భంగా ఆమె న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. విశాఖ వాసుల కోరిక నెరవేరిందని, నైట్ ల్యాండింగ్‌కు అనుమతించిన కేంద్రమంత్రులు ఆంటోనీ, పళ్లంరాజులకు కృతజ్ఞతలు అన్నారు.

దీంతో విశాఖలో పర్యాటక, ఐటి రంగాలు అభివృద్ధి చెందుతాయన్నారు. వారానికి మూడు రోజులు మూడు గంటలు ల్యాండింగ్ సమయం పెరిగిందన్నారు. దీంతో రాత్రి ఎనిమిది గంటల నుండి పదకొండు గంటల వరకు ల్యాండింగ్‌కు అనుమతి లభించిందన్నారు. ఇక నుండి విశాఖపట్నం విమానాశ్రయానికి అంతర్జాతీయ విమానాలు వస్తాయన్నారు. అక్టోబర్ 1వ తేది నుండి నైట్ ల్యాండింగ్‌కు కేంద్రం అనుమతించిందన్నారు. పార్లమెంటు ఆవరణలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటును అడ్డుకుంది టిడిపియే అన్నారు. తాను విగ్రహ ఏర్పాటుకు కృషి చేస్తానని చెప్పారు. కుటుంబం లిస్టులో తన పేరు ఎందుకు లేదో తనకు తెలియదన్నారు.

రాష్ట్రంలో పిసిసి చీఫ్, ముఖ్యమంత్రి బాధ్యతలను మరొకరికి అప్పగిస్తారని తాను భావించడం లేదని కేంద్రమంత్రి పళ్లం రాజు అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా, బొత్స సత్యనారాయణ పిసిసి చీఫ్‌గా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారన్నారు. రాష్ట్రంలో బ్రహ్మాండమైన నాయకత్వం ఉండగా మార్పు ప్రచారం ఎందుకు జరుగుతుందో అర్థం కావడం లేదన్నారు. ప్రభుత్వ అభివృద్ధి పనులను ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు.

English summary
Central minister Daggupati Purandeswari has blamed Telugudesam Party for not install late NTR's statue in Parliament premises.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X