• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

నిజాలు చెప్తే...: లక్ష్మీపార్వతిని కడిగేసిన నన్నపనేని

By Srinivas
|

Laxmi Parvathi-Nannapaneni Rajakumari
హైదరాబాద్: తమ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన కుటుంబంతో సహా విదేశీ పర్యటనలకు వెళ్లడాన్ని తప్పు పడుతూ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు లక్ష్మీ పార్వతి ప్రధానమంత్రికి లేఖ రాయడాన్ని టిడిపి నేత నన్నపనేని రాజకుమారి సోమవారం తప్పు పట్టారు. లక్ష్మీ పార్వతికి నన్నపనేని కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు తన కుటుంబంతో అమెరికా వెళ్లడం తప్పా అని ప్రశ్నించారు. లక్ష్మీ పార్వతి కూడా విదేశాలకు వెళుతుంటారు కదా అన్నారు.

స్వర్గీయ నందమూరి తారక రామారావును మోసం చేసి సంపాదించిన నగలు, పట్టుచీరలు తదితర విలువైన వస్తువులు దాచుకోవడానికే ఆమె విదేశీయానం చేస్తుంటారా అని ఎద్దేవా చేశారు. లక్ష్మీ పార్వతి వల్లనే ఎన్టీఆర్‌కు భారతరత్న రాలేదని ఆరోపించారు. చంద్రబాబు పైన అనవసర విమర్శలు చేసినందుకు ఆమె వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నిత్యం ప్రజా సమస్యలపై పోరాడే బాబు విదేశాలకు వెళ్తే తప్పేంటమన్నారు.

ఎన్టీఆర్ పదవితో పాటు ప్రాణం పోవడానికి లక్ష్మీపార్వతియే కారణమని ఆరోపించారు. ఎన్టీఆర్ ప్రతిష్టకు ఆమె మచ్చ తీసుకు వచ్చారన్నారు. ఎన్టీఆర్ ఎలా చనిపోయారనే విషయాన్ని బయట పెడితే లక్ష్మీ పార్వతి తల ఎత్తుకు తిరగలేరన్నారు. ఆయన ఎలా చనిపోయారో అప్పుడే వివరించామని నన్నపనేని అన్నారు.

కాగా చంద్రబాబు నాయుడు, ఆయన భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేష్ గత 15 సంవత్సరాలుగా చేసిన విదేశీ పర్యటనలు, విదేశాలలో వారి ఆర్థిక లావాదేవీలపై విచారణ జరిపించాల్సిందిగా లక్ష్మీ పార్వతి ప్రధాని మన్మోహన్ సింగ్‌ను డిమాండ్ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆమె ఆదివారం ప్రధాని మన్మోహన్ సింగ్‌కు లేఖ రాశారు. తన అల్లుడైన చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనకు వెళ్లారని ఆమె ఆ లేఖలో తెలిపారు.

చంద్రబాబు విదేశీ పర్యటన వ్యక్తిగతమైతే ఎవరూ తప్పుపట్టాల్సిన అవసరం లేదని, కానీ లోగడ తెహల్కా పత్రిక చంద్రబానును దేశంలోని అత్యంత సంపన్నుడైన రాజకీయ నాయకునిగా ప్రకటించిందని ఆమె గుర్తు చేశారు. బాబుకు సింగపూర్, మలేషియాలలో హోటళ్లు, వాణిజ్య సముదాయాలు ఉన్నట్లు కూడా ఆ పత్రిక పేర్కొందని ఆమె తెలిపారు. కాబట్టి దేశంలోని అత్యున్నత దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాల్సిందిగా ఆమె ప్రధానిని కోరారు.

గతంలో వీటిపై విచారణ జరపాల్సిందిగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ కోర్టుకు నివేదించినా అత్యంత దురదృష్టకరమైన రీతిలో ఆ పిటిషన్ తిరస్కరణకు గురైందని ఆమె అన్నారు. చంద్రబాబు పార్టీ ద్వారా 2009 తర్వాత సిఎం రమేష్, వైవి సుజనాచౌదరి ద్వారా రాజ్యసభలో అడుగుపెట్టారని, ప్రజా జీవితంలో పెద్దగా కనిపించని వీరు రాజ్యసభకు వెళ్లడం ఆశ్చర్యాన్ని, ఆసక్తిని కలిగించిందని ఆమె అన్నారు.

2009 సాధారణ ఎన్నికలకు ముందు ఈ ఇద్దరి ద్వారానే తెలుగుదేశం పార్టీ ఎన్నికల కోసం మనీ లాండరింగ్ చేసిందని ఆమె ఆరోపించారు. మనీ లాండరింగ్ కేసు విచారణలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ మాజీ ముఖ్యమంత్రి భాగస్వామ్యం ఉన్నట్లు హసనీ అలీ వెల్లడించిన విషయం జాతీయ మీడియాలో ప్రముఖంగా వచ్చిందని ఆమె గుర్తు చేశా్రు. అప్పట్లో హసన్ అలీ వ్యవహారం బయటకు వచ్చిన కొద్ది రోజుల్లనే చంద్రబాబు హడావిడిగా విదేశీ పర్యటనకు వెళ్లారని ఆమె అన్నారు.

English summary
Telugudesam party senior leader Nannapaneni Rajakumari has questioned NTR TDP president Laxmi Parvathi about her foreign tours.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X