• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

ఢిల్లీ వెళ్లి రావలె: డిప్యూటీ సిఎం సహా పలువురు దారి

By Pratap
|

Damodara Rajanarasimha - DL Ravindra Reddy
హైదరాబాద్: తాజా పరిణామాల నేపథ్యంలో పలువురు రాష్ట్ర కాంగ్రెసు నాయకులు ఢిల్లీ బాట పట్టేందుకు సిద్ధపడుతున్నారు. ధర్మాన రాజీనామాపైనే కాకుండా ఇతర వ్యవహారాలపై యధాతథ స్థితి కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెసు నాయకులు అధిష్టానం పెద్దలతో మాట్లాడే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ సహా పలువురు సీనియర్‌ నేతలు వరుసగా ఢిల్లీ వెళ్ళనున్నట్టు తెలుస్తోంది.

ఉప ముఖ్యమంత్రి దామోదర రాజ నరసింహ బుధవారం ఢిల్లీ వెళ్తున్నారు. అధిష్ఠానం పెద్దలు పలువురితో ఆయన చర్చించే అవకాశాలున్నట్టు తెలిసింది. ఈ చర్చల్లో కొంతకాలంగా రాష్ట్ర కాంగ్రెస్‌లో నెలకొన్న పరిణామాలు ప్రధానంగా చర్చకు వస్తాయని అంటున్నారు.. ఇటీవలి కాలంలో పార్టీ పరిణామాలపెై రాజనరసింహ పెద్దగా స్పందించటం లేదు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక, ఇతర శాఖా పరమైన కార్యక్రమాలకే ఆయన పరిమితమయ్యారు.

నాయకత్వం మార్పు గురించి గానీ, పిసిసి అధ్యక్షుడి మార్పు గురించి గానీ, మంత్రుల వ్యవహారం గురించి కానీ ఆయన నోరు మెదపలేదు. అయితే పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ, తన వర్గంతో సంప్రదింపులు జరుపుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి బుధవారం ఢిల్లీ పర్యటన జరపనున్నారని తెలియటంతో పార్టీ వర్గాలలో మళ్ళీ చర్చ మొదలెైంది.

పిసిసి అధ్యక్షుడు బొత్స సత్య నారాయణ శనివారం హస్తిన బాట పట్టనున్నారు. గత వారం ఢిల్లీలో మూడు, నాలుగు రోజుల పాటు మకాం వేసి అధిష్ఠానం పెద్దలు, కోర్‌ కమిటీ సభ్యులతో మంతనాలు జరిపిన తర్వాత అక్కడే మీడియాతో మాట్లాడుతూ పిసిసి పదవి ఉన్నా, ఊడినా ఇబ్బందేమీ లేదని వేదాంత ధోరణి కనబరిచారు. ఆ వెంటనే బొత్స పదవి ఊడటం ఖాయమని, ఆయన స్థానంలో చిరంజీవి వస్తారని ఊహాగానాలు చెలరేగాయి.

అయితే అధిష్ఠానం ప్రస్తుతానికి ఆ అంశాన్ని యథాతథంగా ఉంచాలనే నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ముఖ్యమంత్రి కిరణ్‌కు మార్‌ రెడ్డి, బొత్స ఇద్దరూ సోమవారం ఢిల్లీ వెళ్ళాల్సి ఉండింది. అక్కడినుంచి వచ్చేటప్పుడే సీఎంకు అధిష్ఠానం పెద్దలు ఈ విషయం చెప్పారు. అయితే అనుకోని విధంగా ఈ పర్యటన వాయిదా పడింది. మళ్ళీ శనివారం ఢిల్లీ రావాలని బొత్సకు పిలుపు అందటం పార్టీ వర్గాలలో చర్చనీయాంశమైంది.

అతి త్వరలో అటు కేంద్ర కేబినెట్‌, ఇటు రాష్ట్ర కేబినెట్‌లో పూర్తి స్థాయి ప్రక్షాళన ఉంటుందని, రాష్ట్ర కేబినెట్‌లో సుప్రీం నోటీసులు అందుకున్న వారు, ఆరోపణలు ఎదు ర్కుంటున్న వారితో సహా పలువురు మంత్రులకు ఉద్వాసన చెప్పి కొత్త వారిని తీసుకుంటారని ఊహాగానాలు తీవ్రతర మవుతున్న నేపథ్యంలో బొత్స ఢిల్లీ యాత్ర రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నట్టే అని పార్టీ వర్గాలు అంటున్నాయి.

ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డితో తీవ్ర స్థాయి విభేదాలున్న మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి సైతం రెండు, మూడు రోజుల్లో ఢిల్లీ వెళ్ళను న్నారు. ఉప ఎన్ని కలు జరగటానికి చాలా ముందు నుంచే ముఖ్య మంత్రి వ్యవహార శెైలిని డీఎల్‌ తీవ్రంగా విమర్శి స్తున్నారు. ఉప ఎన్నికల ఫలితాలు రావటం, కాంగ్రెస్‌ పార్టీ దారుణం గా పరాజయం పాలెైన తర్వాత డీఎల్‌ విమర్శల తీవ్రత పెరిగింది. డీఎల్‌తో పాటు మరి కొందరు సీనియర్లు సైతం ఢిల్లీ వెళ్ళనున్నట్టు తెలిసింది.

English summary
it is said that including deputy CM Damodara rajanarsimha, several Congress leaders are in an effort to go to Delhi to meet high command leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X