వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షిండేతో తెలంగాణపై చర్చించలేదు: దామోదర

By Pratap
|
Google Oneindia TeluguNews

Damodara Rajanarasimha
న్యూఢిల్లీ: కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేతో తెలంగాణపై చర్చించలేదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు. ఆయన బుధవారం షిండేను కలిశారు. మర్యాదపూర్వకంగానే షిండేను తాను కలిసినట్లు ఆయన తెలిపారు. రాజకీయాలు తమ మధ్య చర్చకు రాలేదని షిండేతో భేటీ తర్వాత ఆయన మీడియా ప్రతినిధులతో చెప్పారు. ఓ దళిత మంత్రిగా తాను షిండేను కలిసినట్లు ఆయన చెప్పారు.

ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌పై తాను షిండేకు వివరించినట్లు, దానికి చట్టబద్ధత కల్పించాల్సిన అవసరాన్ని చెప్పినట్లు ఆయన తెలిపారు. తెలంగాణపై నిర్ణయం వస్తుందనే విషయంపై తనకు ఏ విధమైన సమాచారం లేదని ఆయన అన్నారు. రాష్ట్ర నాయకత్వ మార్పుపై ఎవరికైతే ఆశ ఉందో వారినే ఆడగాలని ఆయన మీడియా ప్రతినిధుల ప్రశ్నకు సమాధానంగా అన్నారు. ఆ తర్వాత ఆయన రక్షణ శాఖ మంత్రి ఎకె ఆంటోనీతో సమావేశమయ్యారు.

సీమాంధ్ర పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు కూడా సుశీల్ కుమార్ షిండేను కలిశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్డు చైర్మన్ పదవి తన దక్కలేదని అసంతృప్తిగా ఉన్నట్లు తనపై వార్తలు వస్తున్న నేపథ్యంలో రాయపాటి షిండేతో సమావేశమయ్యారు.

పార్టీ ఏ విధమైన నిర్ణయం తీసుకున్నా తాను కాంగ్రెసు పార్టీతోనే ఉంటానని ఆయన చెప్పారు. రాష్ట్రంలో పార్టీ, ప్రభుత్వ పనితీరును పార్టీ అధిష్టానం అంచనా వేస్తోందని ఆయన చెప్పారు. కాంగ్రెసు అధిష్టానం తెలంగాణపై ఓ నిర్ణయం తీసుకోవడానికి కసరత్తు చేస్తోందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ ఇద్దరు నేతలు షిండేను కలుసుకోవడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

English summary
Deputy CM Damodara Rajanarasimha, who met union home minister Sushil kumar Shinde, said that Telangana has not been discussed. He said that it is a courtesy call.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X