వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాకు చెప్పకుంటే ఎలా?: నామాపై హరికృష్ణ ఆగ్రహం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Harikrishna-Nama Nageswara Rao
న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ బుధవారం సొంత పార్టీ ఖమ్మం పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వర రావు పైన తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సిపిఐ నిర్వహించిన రైతు సదస్సుపై తమకు సమాచారం ఎందుకు ఇవ్వాలేదని నామాపై మండిపడ్డారు. ఈ సదస్సుకు పార్టీ సీనియర్ నేత కరణం బలరాం నేతృత్వంలో ఓ బృందం ఢిల్లీ వస్తున్నట్లు తోటి పార్టీ ఎంపీలకు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు.

అయితే తాను అందరికీ సమాచారం అందించానని, కానీ ఎందుకు అందలేదో తనకు తెలియదని నామా... హరికృష్ణకు చెప్పారని తెలుస్తోంది. అందుకు హరికృష్ణ తనకు సిపిఐ రైతు సదస్సు విషయం ఈ రోజు పేపర్లో చూసే వరకు తెలియదని, ఆ సమావేశానికి పార్టీ బృందం వచ్చినట్లుగా కూడా పత్రికల్లో చూస్తేనే తెలిసిందని హరికృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మిగతా ఎంపీలు కూడా నామా తీరుపై అసంతృప్తితోనే ఉన్నారని అంటున్నారు. ఎంపీల మధ్య సమన్వయం లేకుంటే ఎలా అని హరికృష్ణ నామాను ప్రశ్నించారు.

కాగా మంగళవారం న్యూఢిల్లీలో సిపిఐ పార్టీ రైతు సదస్సును నిర్వహించింది. ఈ కార్యక్రమానికి తొలుత పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హాజరు కావాలనుకున్నారు. కానీ చివరి నిమిషంలో ఆయన పర్యటన రద్దయింది. పార్టీ తరఫున కరణం బలరాం బృందాన్ని బాబు ఢిల్లీకి పంపించారు. ఈ సదస్సులో కరణం బృందం కిందనే కూర్చోగా.. నామా నాగేశ్వర రావు, ఎర్రన్నాయుడు మాత్రం డయాస్ పైన కూర్చోవడం గమనార్హం.

English summary
Telugudesam Party senior leader Nandamuri Harikrishna has fired at Khammam MP Nama Nageswara Rao on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X