హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మద్రాసు రాష్ట్రంలో ఉంటేనే బాగుండేది: టిజి వెంకటేష్

By Pratap
|
Google Oneindia TeluguNews

TG Venkatesh
హైదరాబాద్: రాయలసీమ మద్రాసు రాష్ట్రంలో ఉండి ఉంటే అభివృద్ధి చెంది ఉండేదని రాష్ట్ర మంత్రి టిజి వెంకటేష్ అన్నారు. మద్రాసు రాష్ట్రంలో ఉండి ఉంటే కృష్ణా జలాలన్నీ తమకే దక్కేవని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. రాయలసీమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆయన అన్నారు. త్వరలో రాయలసీమ శానసభ్యుల సమావేశాన్ని ఏర్పాటు చేసి సమస్యలపై చర్చిస్తామని ఆయన చెప్పారు.

రాయలసీమ శాసనసభ్యులతో చర్చించి, ఈ ప్రాంత సమస్యలను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి తెలియజేస్తామని, రాయలసీమ హక్కులను నెరవేరుస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని ఆయన చెప్పారు. సమస్యలను ముఖ్యమంత్రి ముందు ఉంచడానికి సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రాయలసీమ ప్రాంతం రాజధానిని కోల్పోయిందని ఆయన అంటూ ఇంకా ఎన్ని దెబ్బలు తినాలని అడిగారు.

సాగునీటి ప్రాజెక్టులపై చర్చించడానికి బుధవారం భారీ నీటి పారుదల శాఖ మంత్రి సుదర్శన్ రెడ్డి అధ్యక్షతన మంత్రి వర్గ ఉపసంఘం సమావేశమైంది. రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టుల పురోగతిపై సమావేశంలో చర్చించారు. ఇప్పటి వరకు ప్రాజెక్టులపై ఎంత ఖర్చు చేశాం, ఎంత అవసరం అనే విషయాలపై చర్చించింది. సాగునీటి ప్రాజెక్టులపై చర్చించేందుకు మరోసారి సమావేశమవుతామని సుదర్శన్ రెడ్డి మీడియా ప్రతినిధులతో చెప్పారు.

ప్రస్తుతం 50 శాతం, 75 శాతం పనులు పూర్తయిన ప్రాజెక్టులపై దృష్టి పెట్టినట్లు ఆయన తెలిపారు. 75 శాతం పనులు పూర్తయిన ప్రాజెక్టులకు మరో పది వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయని ఆయన అన్నారు.

English summary
Minister TG Venkatesh said that injustice is meted out to Rayalaseema. Rayalaseema region should have been in Madras state, he opined.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X