వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'గాలి' డబ్బు కాంగ్రెస్‌కూ, నాకు కాదు: లాలూకు సుష్మా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Lalu Prasad Yadav - Sushma Swaraj
న్యూఢిల్లీ/బెంగళూరు: గనులను అక్రమంగా తవ్వుకోవడానికి, అందుకు దన్నుగా నిలబడటానికి కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి పలువురు రాజకీయ నేతలకు కోట్లాది రూపాయలు ఇచ్చి ఉంటారని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, లోకసభ ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి కూడా గాలి బ్రదర్స్ పెద్ద ఎత్తున ముడుపులు ఇచ్చారని ఆమె మంగళవారం ట్విటర్‌లో ఆమె వెల్లడించారు.

బొగ్గు బ్లాకుల కేటాయింపు కుంభకోణంలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున ముడుపులు ముట్టాయని సోమవారం విలేకరులతో మాట్లాడుతూ సుష్మా స్వరాజ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీనిపై మంగళవారం ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్ యాదవ్ స్పందించారు. రెడ్డి బ్రదర్స్ బిజెపి నేతలకు పెద్దఎత్తున ముడుపులు ముట్ట చెప్పారన్న విషయం ప్రతి ఒక్కరికీ తెలిసిందే అని లాలు ఆరోపించారు.

ఆ వ్యాఖ్యలపై సుష్మా స్వరాజ్ ట్విటర్‌లో స్పందించారు. రెడ్డి బ్రదర్స్ నుంచి భారీ ముడుపులు ఎవరు తీసుకున్నారో లాలు ప్రసాద్ తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆయనతో పాటు దేశానికి కూడా నేను చెప్పదలచుకున్నది ఏమిటంటే.. కాంగ్రెస్ పార్టీకి కూడా ముడుపులు అందాయని, ఆ పార్టీ ముఖ్యమంత్రి సిఫారసు మేరకు, కాంగ్రెస్ ప్రభుత్వమే గాలి బ్రదర్స్‌కు గనులన్నీ కేటాయించిందని చెప్పారు.

గాలి బ్రదర్స్‌కు కేటాయించిన గనులు, వాటికి సంబంధించిన సిఫారసులను బయట పెట్టాలని, గాలి బ్రదర్స్‌కు ఎవరు సిఫారసు చేశారో, ఎవరికి ఆర్థికంగా లబ్ధి చేకూరిందో వంటి నిజాలన్నీ ప్రజలకు తెలుస్తాయని, వాస్తవాలు అన్నిటినీ జాతి ముందుంచాలని సుష్మ డిమాండ్ చేశారు. గాలి బ్రదర్స్ నుంచి తనకు పైసా కూడా ముట్టలేదని, కానుకలూ తీసుకోలేదని పేర్కొన్నారు. కాగా, సుష్మ వ్యాఖ్యలపై వ్యాఖ్యానించేందుకు బిఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు శ్రీరాములు నిరాకరించారు

English summary
BJP leader Sushma Swaraj said in twitter that Karnatka former minister Gali Janardhan Reddy gave bribe to Congress leaders for illegal mining.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X