వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇందిరా గాంధీకి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ క్షమాపణ చెప్పిన వేళ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Neil Armstrong-Indira Gandhi
న్యూఢిల్లీ/వాషింగ్టన్: చంద్రమండలంపై మొదటిసారి కాలుమోపిన, ఇటీవల మృతి చెందిన నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ మన దివంగత ప్రధానమంత్రి ఇందిరా గాంధీకి క్షమాపణలు చెప్పారు! 1969 జూలై 20వ తేదిన నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రుడిపై అడుగుపెట్టే ఘట్టాన్ని చూసేందుకు ఇందిరా గాంధీ తెల్లవారుజామున నాలుగున్నర గంటల వరకు మెలుకువతోనే ఉన్నారట. అయితే ఈ చంద్రయానాన్ని ఆర్మ్‌స్ట్రాంగ్ ముగించుకొని ఆ తర్వాత ప్రపంచయాత్ర చేపట్టారు.

తన సహచర వ్యోమగామి ఎడ్విన్ ఆల్డ్రిన్‌తో కలిసి యాత్రలో భాగంగా ఢిల్లీకి వచ్చారు నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్. అప్పుడు ఇందిరా గాంధీని కలిశారు వారు. ఈ సమయంలో అతను ఇందిరకు క్షమాపణలు చెప్పారని ప్రత్యక్ష సాక్షి, విదేశాంగశాఖ మాజీ మంత్రి కె.నట్వర్ సింగ్ మంగళవారం తెలిపారు. ఇందిరను కలుసుకునేందుకు వచ్చిన నీల్, ఎడ్విన్‌లకు కేంద్రపెద్దలు ఘన స్వాగతం పలికారు. ఆ సమయంలో నట్వర్ సింగ్‌కు మాట్లాడే అవకాశమిచ్చారు.

దీంతో సింగ్ మాట్లాడుతూ... మీరు చంద్రునిపై అడుగుపెట్టే అపురూపమైన దృశ్యాలను వీక్షించాలన్న ఆకాంక్షతో ప్రధాని ఇందిరా గాంధీ తెల్లవారుజాము వరకు మెలుకువతో ఉన్నారని చెప్పారు. దీంతో కలుగజేసుకున్న నీల్.. ఇందిరకు వెంటనే క్షమాపణలు చెప్పి, మరోమారు ఇలా మిమ్మల్ని ఎదురు చూడనివ్వకుండా భారత కాలమానం ప్రకారమే తన అంతరిక్షయాత్రను కొనసాగిస్తానని వినమ్రంగా చెప్పారని నట్వర్ సింగ్ మంగళవారం తెలిపారు.

English summary
"I apologise for the inconvenience," US astronaut Neil Armstrong told Indira Gandhi when informed that the Indian Prime Minister had kept awake till 4:30 am to watch him land on the moon on Jul 20, 1969.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X