హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కార్టూన్ పార్టీ: అనిల్, కిరణ్‌కు చివరి రోజులు.. శంకరన్న

By Srinivas
|
Google Oneindia TeluguNews

P Shankar Rao
హైదరాబాద్: సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణకు మతిభ్రమించి మాట్లాడుతున్నట్లుగా ఉందని ప్రభుత్వ విప్ ఈరవత్రి అనిల్ గురువారం అన్నారు. కొద్ది రోజులుగా కాంగ్రెసు నేతలపై నారాయణ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, సిపిఐ పార్టీ కార్టూన్ పార్టీలో మారిందని మండిపడ్డారు. నారాయణ తన నోటిని అదుపులో పెట్టుకోవాలని లేకుంటే పిచ్చాసుపత్రిలో చేర్పించాల్సి ఉంటుందని హెచ్చరించారు. విద్యుత్ సమస్యలపై తెలుగుదేశం పార్టీ డ్రామాలు ఆడుతోందని విమర్శించారు.

విద్యుత్ కోసం జరిగిన ఉద్యమంలో ఆ పార్టీ నేత నారా చంద్రబాబు నాయుడు ముగ్గురిని కాల్చి చంపించారని గుర్తు చేశారు. చంద్రబాబును ఎన్నిసార్లు ఉరితీయాలో ఆ పార్టీ నేతలే చెప్పాలని అన్నారు. కాగా ఇటీవల కాంగ్రెసు నేతలపై నారాయణ మండిపడుతున్న విషయం తెలిసిందే. తెలంగాణ కోసం 'ప్రజాపోరు' యాత్ర నిర్వహిస్తున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ మంత్రులపై, అధికార పార్టీ నాయకులపై తీవ్ర వ్యాఖ్యలతో మండిపడ్డారు. బుధవారం మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లోనూ, హైదరాబాద్ ఎల్బీ నగర్‌లోనూ ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. పిచ్చాసుపత్రుల్లో ఉండాల్సిన వారంతా కేబినెట్‌లో ఉండడం వల్లనే రాష్ట్ర పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు.

ఈ ప్రాంత కాంగ్రెస్ శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు చేతగాని దద్దమ్మలై సోనియాను చూసి దాక్కుంటున్నారని మండిపడ్డారు. 'జై తెలంగాణ, జై సమైక్యాంధ్ర' అంటున్న కాంగ్రెస్ నేతలందరూ గాంధీభవన్‌లో ఒకేచోట ఉంటూ రాజకీయ వ్యభిచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. డిసెంబర్ 9 ప్రకటనపై మాట తప్పిన కాంగ్రెస్ నేతలను పట్టపగలు నడివీధిలో ఊరేగించి ఉరివేయాలన్నారు.

వీరంతా మోసకారులని, ముక్కునేలకు రాసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో కప్పల్లా అరుస్తూ ఢిల్లీలో మాత్రం పిల్లుల్లా మూలుగుతారని విమర్శించారు. రొయ్యకులాగే వీరికీ మీసాలున్నాయి తప్ప రోషం మాత్రం లేదని దెప్పిపొడిచారు. "పార్లమెంటులో సోనియాను చూసి, తలలు బెంచీల కింద పెట్టుకునే మీరు మగాళ్లా?'' అని ఎద్దేవా చేశారు. అవసరమనుకుంటే కాంగ్రెస్ పార్టీ దేవుడిని కూడా అమ్ముకుంటుందని అన్నారు.

తెలంగాణ సాయుధ పోరాట వీరుల కుటుంబాలు అర్ధాకలితో అలమటిస్తుంటే మంత్రుల లూటీకి ప్రభుత్వం వంతపాడుతోందని విమర్శించారు. విద్యుత్తు సమస్యను పరిష్కరించకపోతే ప్రజలు గుండు కొట్టించి ఊరేగిస్తారని హెచ్చరించారు. నాన్చుడు ధోరణి విడనాడి తెలంగాణపై కలసిరావాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబుకు హితవుపలికారు.

మరోవైపు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెసు పార్టీని నష్టపర్చడమే ఎజెండాగా పని చేస్తున్నారని ఆరోపించారు. పార్టీ విధి విధానాలకు వ్యతిరేకంగా పని చేసే నాయకులకు సిఎం పదవులను ఇస్తున్నారని, కిరణ్‌కు ఇవే చివరి రోజులని ఆయన జోస్యం చెప్పారు. త్వరలోనే నాయకత్వ మార్పు ఉంటుందని చెప్పారు.

English summary
Government whip Anil said CPI is a cartoon party. He lashed out Narayana for his comments against Congress leaders. Former minister Shankar Rao said Kiran Kumar Reddy will send to home soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X