కక్ష సాధింపు లేదు: ఫీజు రీయింబర్సుమెంట్స్‌పై కిరణ్

ఈ సంవత్సరం నుండి స్కాలర్ షిప్స్, ఫీజులను వేరు చేస్తున్నట్లు చెప్పారు. కోర్టు తీర్పుకు అనుగుణంగా విధానాల్లో మార్పు చేశామని తెలిపారు. మేనేజ్‌మెంట్ కోటా సీట్లు మెరిట్ ప్రకారమే కేటాయించాలని ముఖ్యమంత్రి సూచించారు. కాలేజీలలో మౌలికా సదుపాయాలను టాస్క్ ఫోర్స్ పరిశీలిస్తుందని చెప్పారు. నిబంధనల మేరకు క్వాలిఫైడ్ స్టాఫ్ ఖచ్చితంగా ఉండాలన్నారు. విద్యార్థుల అటెండెన్స్, ప్రతిభ సమాచారం ఆన్‌లైన్‌లో పొందుపర్చాలన్నారు.
ఫీజు అంశాన్ని నిపుణులే కాకుండా కేబినెట్ సబ్ కమిటీ కూడా పరిశీలిస్తోందన్నారు. అడ్మిషన్ల వివరాలు వెబ్ సైట్లో ఉంచాలని, విద్యార్థుల నుండి ఎలాంటి డొనేషన్లు వసూలు చేయరాదన్నారు. ప్రభుత్వానికి ఎవరి పైనా కక్ష సాధింపు లేదన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న వారికి, ఇంటర్‌ను ప్రభుత్వ ఖర్చుతో పూర్తి చేసిన వారికి, ఎంసెట్‌లో పదివేల లోపు ర్యాంకు వచ్చిన వారికి పూర్తి ఫీజును ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పారు. కాలేజీలలో తనిఖీలు పూర్తయిన తర్వాత కూడా టాస్క్ ఫోర్సు రిపోర్టును కూడా తాము ఆన్ లైన్‌లో పెడతామని చెప్పారు.
మేనేజ్‌మెంట్ కోటా సీట్ల కోసం ప్రత్యేక వెబ్ సైట్ ఏర్పాటు చేయాలన్నారు. ఆ సీట్లను ఆన్ లైన్లోనే భర్తీ చేయాలని సూచించారు. అన్ని కళాశాలలు నిబంధనలు పాటించాల్సిందేనని, నిబంధల కోసమే తప్ప కక్ష సాధింపు కోసం టాస్క్ ఫోర్స్ కాదన్నారు. విద్యార్థుల ప్రవర్తనను పోస్టు కార్డు, ఎస్సెమ్మెస్‌ల ద్వారా తెలియజేయాలనేది నిబంధన అన్నారు. కాగా వివరణ ఇచ్చేముందు ముఖ్యమంత్రి ఇంజనీరింగ్ కళాశాలలపై ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరముందని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications