హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎన్డీటివీతో కలిసి సాక్షి పని చేసినా సర్వేకు..!: కొణతాల

By Srinivas
|
Google Oneindia TeluguNews

Konathala Ramakrishna
హైదరాబాద్: ఎన్టీటివి చేసిన సర్వేలపై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు కొణాతల రామకృష్ణ, సోమయాజులు బుధవారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని విమర్శించారు. తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి డబ్బులిచ్చి సర్వేలు చేయించారని చెప్పడం ఆయన బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని దుయ్యబట్టారు. రాష్ట్రంలోని రాజకీయ వాతావరణం సర్వేల ద్వారా బయటపడేసరికి టిడిపి అధినేత డిప్రెషన్‌కు లోనై చిల్లర మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు.

ఆయన వెంటనే జాతికి, మీడియాకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం వారు విలేకరులతో మాట్లాడారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నట్లు సర్వేలో వెల్లడి కావడం పట్ల చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చాలా అసహ్యంగా ఉన్నాయన్నారు. 2009 తర్వాత ఇప్పటివరకు జరిగిన 75 ఉప ఎన్నికల్లో ఏ ఒక్క చోట టిడిపి గెలవలేదని, పైగా కొన్ని స్థానాల్లో డిపాజిట్లు పోగొట్టుకుందని గుర్తుచేశారు.

నెల్లూరు పార్లమెంటు స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కూడా టిడిపి డిపాజిట్ కోల్పోయిందన్నారు. చంద్రబాబు వాస్తవాలను దాచి ఇతరులపై గోబెల్స్ ప్రచారం చేయడం మానుకోవాలని హితవు చెప్పారు. 1989 నుంచి దేశంలో పలు మీడియా సంస్థలు ఒక్కొక్క సమయంలో ఓపీనియన్ పోల్స్ నిర్వహిస్తున్నాయని, ఒక్కొక్క విషయంపై సర్వేలు చేస్తుంటారని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయనే దానిపై ప్రజల అభిప్రాయాలను వెల్లడిస్తుంటారని, 2011లో కూడా పలు సర్వేలు మనం గమనించామని, 2011 ఆగస్టులో హిందు, సిఎన్‌ఎన్-ఐబీఎన్ చానల్ సర్వేలు చేశాయని గుర్తు చేశారు.

వాటిలో కూడా దాదాపు అవే ఫలితాలు వచ్చాయన్నారు. ఈ మధ్యకాలంలో ఇండియా టుడే, ఎన్డీటీవీ మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో సర్వే చేశారని, వీటిలో కూడా వైయస్సార్ కాంగ్రెసు మెజార్టీ ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకుంటుందని వెల్లడించాయని, దీనిపై చంద్రబాబు అవాకులు చెవాకులు మాట్లాడటం సిగ్గుచేటు అన్నారు. పైగా నాలుగు రాష్ట్రాల్లోనే ఎన్డీటీవీ సర్వేలు ఎందుకు చేసిందంటూ వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడటం సరైంది కాదన్నారు.

మీడియా సంస్థలు జగన్ నుంచి రూ.30 కోట్లు తీసుకుని అనుకూలంగా సర్వేలు ఇచ్చారని చెప్పడం ఆయన దివాలాకోరుతనానికి నిదర్శమని సోమయాజులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగైతే తెలంగాణలో టీఆర్‌ఎస్ బలంగా ఉందని ఆ సర్వేలు చెబుతున్నందున కెసిఆర్ కూడా ఎన్ని కోట్లు ఇచ్చారో చంద్రబాబు చెప్పాలన్నారు. అలా చేస్తే ప్రజల్లో ఆ మీడియాకు ఉన్న విశ్వసనీయత దెబ్బతింటుందే తప్ప పార్టీలకు ఎలాంటి లాభం ఉండదని చెప్పారు. ఒకరి వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలని చంద్రబాబు గోబెల్స్ ప్రచారంతో తనిని తానే నాశనం చేసుకుంటున్నారన్నారు. చంద్రబాబు తన నెత్తిన భస్మాసుర హస్తం పెట్టుకున్నారని ఆయన విమర్శించారు.

కాగా జగన్ మీడియాతో ఎన్డీటివి కలిసి పని చేసిన మాట వాస్తవమేనని, అయితే సర్వే వెనుక తమ ప్రమేయం లేదని జగన్ పార్టీ నేతలు చెబుతున్నారు. ఎన్డీటివికి డబ్బులు ఇచ్చి సర్వేలో తమకు అనుకూలంగా ఉండేలా ఫలితాలను రాబట్టుకున్నామని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. సాక్షి పత్రికతో ఎన్డీటీవీ కలిసి పని చేసిన మాట సాంకేతికంగా వాస్తవమేనని అయితే సర్వేకు ఆ అంశానికి ఎటువంటి సంబంధమూ లేదని చెప్పారని మీడియాలో వార్తలు వచ్చాయి.

English summary
According to news papers..YSR Congress party senior leader Konathala Ramakrishna said that Sakshi worked with NDTV but there is no link with surveys.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X