చిరంజీవి లాబీయింగ్?: టిటిడి మండలిలో వియ్యంకుడు

సభ్యులుగా మంగళగిరి ఎమ్మెల్యే కాండ్రు కమల, ఉప్పల్ ఎమ్మెల్యే బండారు రాజిరెడ్డి, రాజేశ్వరి దేవి, ఎల్ఆర్ శివ ప్రసాద్, సిహెచ్ లక్ష్మణ రావు, రేపాల శ్రీనివాస్, చిట్టూరి రవీంద్ర, జివి శ్రీనాథ్ రెడ్డిలు ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం సాయంత్రం గం.4.30నిమిషాలకు టిటిడి ఈవో సుబ్రహ్మణ్యం, ఈ నెల 31న ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ఎన్.కన్నయ్య, ఎండోమెంట్ కమిషనర్ జి.బలరామయ్య ప్రమాణ స్వకారం చేయనున్నారు.
ప్రమాణ స్వీకారం సందర్భంగా చైర్మన్ కనుమూరి బాపిరాజు మాట్లాడుతూ... పాలకమండలిలో సభ్యులందరిని కలుపుకొని వెళతానని, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. తాడు మూడున్నర దశాబ్దాలుగా రాజకీయాల్లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, మంత్రిని అయి చైర్మన్‌గా అయ్యానని, పదవి స్వీకరించాక ఆనందం కంటే బాధ్యత పెరిగినట్లుగా ఉందన్నారు.
కాగా టిటిడి పాలకమండలిలో ఉన్న శివ ప్రసాద్ రాజ్యసభ సభ్యుడు చిరంజీవి వియ్యంకుడు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల సమయంలో చెన్నైలోని శివ ప్రసాద్ ఇంట్లో రూ.30 కోట్లు పట్టుబడ్డ విషయం తెలిసిందే. ఆ డబ్బులు చిరంజీవికి సంబంధించినవే అనే ప్రచారం జోరుగా జరిగింది. ఆ వ్యాఖ్యలను చిరంజీవి కొట్టి పారేశారు. అయితే ఇప్పుడు అదే శివ ప్రసాద్‌కు టిటిడి పాలకమండలిలో అవకాశం కల్పించేందుకు చిరంజీవి ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేసి ఉంటారనే వ్యాఖ్యలు జోరుగా వినిపిస్తున్నాయి.
-
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి..












Click it and Unblock the Notifications