కేంద్ర మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ: సిఎంగా జైపాల్ రెడ్డి?

జాతీయ మీడియాలో వచ్చిన వార్తాకథనాల ప్రకారం - పెట్రోలియం, విదేశీ వ్యవహారాలు, విద్యుచ్ఛక్తి, రోడ్లు - హైవేలు, సమాచార బ్రాడ్‌కాస్టింగ్ వంటి శాఖల విషయంలో మార్పులుంటాయని అంటున్నారు. అయితే, ఇంకా నిర్దిష్టంగా ఈ మేరకు నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నారు. 2014 సాధారణ ఎన్నికల్లో, కొన్ని రాష్ట్రాల్లో జరిగే శానససభ ఎన్నికల్లో పార్టీ విజయావకాశాలను పెంచుకునే దిశగా కేంద్ర మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉంటాయని సమాచారం.
జైపాల్ రెడ్డి స్థానంలో గులాం నబీ ఆజాద్‌కు పెట్రోలియం శాఖను అప్పగిస్తారని సమాచారం. జైపాల్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పంపిస్తారని తెలుస్తోంది. కార్పొరేట్ వ్యవహారాల మంత్రి వీరప్ప మొయిలీ తాత్కాలికంగా నిర్వహిస్తున్న విద్యుచ్ఛక్తి శాఖను కూడా ఆజాద్‌కు అప్పగించే అవకాశాలున్నాయి. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ఎం కృష్ణను కర్ణాటకకు పార్టీకి బదలాయించే సూచనలున్నాయి. వచ్చే ఏడాది మేలో కర్ణాటకలో ఎన్నికల జరగనున్న నేపథ్యంలో ఈ మార్పు చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. వాణిజ్య, పరిశ్రమల మంత్రి ఆనందశర్మకు విదేశీ వ్యవహారాలను అప్పగించే అవకాశం ఉంది.
అంబికా సోనీని సమాచార, బ్రాడ్‌కాస్టింగ్ శాఖ నుంచి, సిపి జోషీని రోడ్ల శాఖ నుంచి మారుస్తారని చెబుతున్నారు. అంబికా సోనీని మంత్రివర్గంలో కొనసాగిస్తూ జోషీని రాష్ట్రానికి పంపే సూచనలున్నాయి. రాజస్థాన్‌లో వచ్చే ఏడాది చివరలో ఎన్నికలు జరుగుతాయి. దీంతో జోషీని ఆ రాష్ట్రానికి పంపిస్తున్నట్లు తెలుస్తోంది. జైరాం రమేష్ విద్యుచ్ఛక్తి శాఖ కోసం పోటీ పడుతున్నప్పటికీ ప్రధానికి ఆ శాఖను ఆయనకు అప్పగించేందుకు ఇష్టం లేదని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications