వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నరేంద్ర మోడీకి జై, ప్రియాంకకోసం ఎదురుచూపు: సర్వే

By Srinivas
|
Google Oneindia TeluguNews

Narendra Modi-Priyanka Gandhi
న్యూఢిల్లీ: లోకసభకు మధ్యంతర ఎన్నికలు వస్తే అధికార కాంగ్రెసుకు గాని, ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీకి గానీ భారీ స్థానాలు వచ్చే అవకాశం లేదని ప్రముఖ జాతీయ టివి ఛానెల్ ఎన్డీటివి నిర్వహించిన సర్వేలో వెల్లడయింది. సొంత బలంతో ఈ ఇరుపార్టీలు కేంద్రంలో గద్దెనెక్కే అవకాశం లేదని సర్వేలో తేలింది. సోమ, మంగళ, బుధవారాల్లో మొత్తం 11 రాష్ట్రాల సర్వే వివరాలను ఆ ఛానెల్ వెల్లడించింది. దీని ప్రకారం ఆ రాష్ట్రాలలో 361 లోకసభ స్థానాలు ఉండగా.. బిజెపికి 90, కాంగ్రెసుకు 88 సీట్లు వచ్చే అవకాశాలున్నాయి.

మిగతా స్థానాలలో అత్యధికంగా స్థానిక పార్టీలే గెలుపొందనున్నాయి. ఎపిలో వైయస్సార్ కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి, ఒరిస్సాలో బిజెడి, ఉత్తర ప్రదేశ్‌లో సమాజ్ వాది పార్టీ, మహారాష్ట్రలో ఎన్సీపి, పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెసులు అత్యధిక స్థానాలు కైవసం చేసుకునే అవకాశముంది. గుజరాత్‌లో వరుసగా మూడోసారి కూడా నరేంద్ర మోడియే ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర ప్రజలు బలంగా కోరుకుంటున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే బిజెపికి అసెంబ్లీలో 120 సీట్లు వస్తాయి.

మోడీ సమర్థ ముఖ్యమంత్రి అని 82 శాతం మంది చెప్పగా.. ఆయన పరిపాలన చాలా బాగుందని 84 శాతం మంది అభిప్రాయపడ్డారు. మోడీని ప్రధానిని చేయాలా అని అడిగితే 83 శాతం మంది అవునని చెప్పారు. దేశవ్యాప్తంగా మోడిపై 42 శాతం మంది విశ్వాసం వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో బిజెపిలో కొందరు శివసేన వైపు, మరికొందరు ఎంఎన్ఎస్‌తో వెళ్లాలని భావిస్తున్నారు. సిఎంగా పృథ్వీ చవాన్ పని తీరుపై 57 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. ఇక కర్నాటకలో కాంగ్రెసు కంటే బిజెపియే అవినీతి పార్టీ అని ప్రజలు అభిప్రాయపడ్డారు.

ప్రియాంక క్రియాశీలక రాజకీయాల్లోకి రావాలని కాంగ్రెసు మద్దతుదారులు 65 శాతం మంది బలంగా కోరుకుంటున్నారు. హిందీ రాష్ట్రాల్లో ఆమెకు జనాకర్షణ మరింతగా ఉంది. సర్వేల్లో పాల్గొన్న వారిలో 80 శాతం మంది ప్రియాంకకు జై కొట్టారు. ఇతర రాష్ట్రాల్లో 53 శాతం జై కొట్టారు. భారత్ అమెరికా అనుకూల వైఖరి అవలంభించాలని 61 శాతం మంది చెప్పగా వ్యతిరేకంగా ఉండాలని 23 శాతం మంది కోరుకుంటున్నారు. పాక్‌తో స్నేహంపై దాదాపు మిశ్రమ అభిప్రాయం ఉంది. అయితే ఉగ్రవాదుల విషయంలో మాత్రం కఠినంగా వ్యవహరించాలని చెప్పారు.

English summary
The survey said a big chunk of 42% of respondents believe that Modi should be the BJP's for the PM's post, while 23% are in favour of Advani, 20% for Leader of Opposition in Lok Sabha Sushma Swaraj and others get 15% votes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X