వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్రోతల్ హౌస్‌కు భార్యను అమ్మబోయి పట్టుబడ్డాడు!

By Srinivas
|
Google Oneindia TeluguNews

West Bengal
కోల్‌కతా: ఓ భర్త తన భార్యను బ్రోతల్ హౌస్‌లో అమ్మబోయి రెడ్ హ్యాండెడ్‌గా ఓ ట్యాక్సీ డ్రైవర్‌కు పట్టుబడిన సంఘటన పశ్చిమ బెంగాల్‌లో చోటు చేసుకుంది. బుధవారం కేసు నమోదు చేసుకున్న హరే స్ట్రీట్ పోలీసులు భార్యను, ఆమె తల్లిని, భర్తను, ఆటో డ్రైవర్‌ను విచారిస్తున్నారు. అయితే భార్య తల్లి తన అల్లుడు అలాంటి పని చేయడని, ట్యాక్సీ డ్రైవరే తప్పుగా అర్థం చేసుకొని ఉంటాడని వాదనకు దిగడంతో ఏం చేయాలో పోలీసులకు అర్థం కాకుండా పోయింది.

వివరాల ప్రకారం.. సదరు భార్యాభర్తలు ఇద్దరు బుధవారం హూగ్లీలోని తమ ఇంటి నుండి హౌరా స్టేషన్‌కు వచ్చారు. ఓ ట్యాక్సీ ఎక్కారు. వారితో పాటు మరో ఇద్దరు కూడా అందులో ఉన్నారు. ట్యాక్సీ హౌరా బ్రిడ్జి మీది నుండి వెళుతుండగా.. ఇక్కడ అమ్మాయిలను ఎక్కడ అమ్మవచ్చునని డ్రైవర్‌ను గుసగుసగా అడిగాడు. దానికి ట్యాస్కీ డ్రైవర్ అక్కడకు వెళ్లాలండే రూ.250 అవుతుందని చెప్పాడు. అందుకు భర్త సరేనన్నాడు. వారితో పాటు ట్యాక్సీలో ఉన్న మరో ఇద్దరు షేక్స్‌పియర్ సరానీ వద్ద దిగిపోయారు.

ఆ తర్వాత ట్యాక్సీ డ్రైవర్ క్యాబ్‌ను దోరినా క్రాసింగ్ వద్దకు తీసుకు వెళ్లాడు. అక్కడ న్యూస్ ఛానెల్‌కు సంబంధించిన ఓ ఓబి ఛానల్ ముందు నిలిపాడు. ఓబి వ్యాన్‌లో ఎవరూ లేకపోవడంతో అక్కడ నుండి రైటర్స్ బిల్డింగ్‌కు తీసుకు వెళ్లాడు. అక్కడకు వెళ్లి పోలీసులకు తెలియజేశాడు. క్యాబ్ డ్రైవర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం హరే స్ట్రీట్ పోలీసు స్టేషన్‌కు సమాచారమందించారు. భార్యా భర్తలతో పాటు, క్యాబ్ డ్రైవర్‌ను పోలీసు స్టేషన్‌కు తరలించారు.

వారిద్దరికీ మూడు నెలల క్రితమే పెళ్లయిందని పోలీసుల విచారణలో తేలింది. వారిద్దరూ ఒకే ప్రాంతంలో పని చేస్తారు. పోలీసులు విచారిస్తున్న సమయంలోనే భార్య తల్లి అక్కడకు చేరుకొని.. తన అల్లుడు అలాంటి వ్యక్తి కాదని చెప్పింది. అయితే భర్త మాత్రం తనను వదిలేయాల్సిందిగా పోలీసులను విజ్ఞప్తి చేశాడు. దీంతో పోలీసులు గందరగోళంలో పడ్డారు. పోలీసుల సమాచారం మేరకు క్యాబ్ డ్రైవర్ మాత్రం తన ఫిర్యాదుకు కట్టుబడి ఉన్నాడు. పోలీసులు భార్యా భర్తలను విచారిస్తున్నారు.

English summary
An alert cabbie claimed to have saved a woman from being sold in a brothel, allegedly by her husband, on Wednesday. Police are interrogating the woman, her husband and mother at the Hare Street police station. However, the officials are in a dilemma after the bride's mother came and rescued her son-in-law, saying that he cannot even think of doing such a thing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X