స్పీడ్‌కు బ్రేక్స్: దానం, వైయస్‌పై అవాకులు.. కోమటిరెడ్డి

Danam Nagendar - Komatireddy Venkat Reddy
హైదరాబాద్/నల్గొండ: దివంగత వైయస్ రాజశేఖర రెడ్డిపై అవాకులు చెవాకులు పేలవద్దని, వైయస్ లేని లోటు పూడ్చలేనిదని మంత్రి దానం నాగేందర్, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి వేర్వేరుగా ఆదివారం అన్నారు. వైయస్సార్ వర్ధంతి సందర్భంగా హైదరాబాదులోని గాంధీ భవనంలో వైయస్ఆర్ ఫోటోకి కాంగ్రెసు పార్టీ నేతలు నివాళులు అర్పించారు. పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిలు పూలమాల వేశారు.

గాంధీ భవన్‌తో పాటు పంజాగుట్టలోని వైయస్ విగ్రహానికి వారు పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా మంత్రి దానం నాగేందర్ మాట్లాడారు. వైయస్ వల్లే రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెసు రెండోసారి అధికారంలోకి వచ్చిందని చెప్పారు. యువజన కాంగ్రెసు నేత సుధాకర్ బాబుకు స్పీడు ఎక్కువైందని, దానికి బ్రేకులు పడతాయన్నారు. వైయస్ పేరును కాంగ్రెసు మర్చిపోవాలనే అభిప్రాయం సరికాదన్నారు. వైయస్ లేని లోటు పూడ్చలేనిదని, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలన్న వైయస్ కలను తాము నెరవేర్చేందుకు కృషి చేస్తామన్నారు.

వైయస్ ఆశయ సాధనే ఆయనకు తామిచ్చే ఘనమైన, నిజమైన నివాళీ అన్నారు. తెలుగుదేశం పార్టీ నేత దాడి వీరభద్ర రావు తనపై ఎవరూ దాడి చేయకుండా చూసుకోవాలని హితవు పలికారు. దివంగత వైయస్‌ను తక్కువ చేయడం మంచిది కాదని కోమటిరెడ్డి వెంకట రెడ్డి నల్గొంజ జిల్లాలో అన్నారు. వైయస్ పైన కొందరు అవాకులు, చెవాకులు పేలుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో ఎంతమంది సీనియర్ నాయకులు ఉన్నప్పటికీ వైయస్ తనను చిన్న వయస్సులోనే ఎమ్మెల్యేని, మంత్రిని చేశారన్నారు. వైయస్ పథకాలకు పేర్లు మారిస్తే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందన్నారు.

పార్టీలో యువనాయకత్వాన్ని బలపరచిన నేత వైయస్ అన్నారు. నల్గొండ జిల్లాలో వైయస్ అతిపెద్ద ఆసుపత్రి కోసం కృషి చేశారని, జిల్లాను ఫ్లోరైడ్ నుండి రక్షించడానికి వైయస్ ప్రయత్నాలు చేశారన్నారు. జిల్లా ప్రజలు వైయస్‌కు రుణపడి ఉంటారన్నారు. కాగా హైదరాబాదులో జరిగిన కార్యక్రమంలో బొత్స, కిరణ్‌తో పాటు మంత్రులు దానం నాగేందర్, కాసు వెంకట కృష్ణా రెడ్డి, వట్టి వసంత్ కుమార్, ఎంపీలు కెవిపి రామచంద్ర రావు, అంజన్ కుమార్ యాదవ్, ఉండవల్లి అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+