గొడ్డలితో దాడి: అత్తను నరికి, ఉరేసుకున్న అల్లుడు

వివరాలు ఇలా ఉన్నాయి - ఐదేళ్ల క్రితం కోటగరి మండలం కల్లూరు చిన్నవాల్గోట్ గ్రామానికి చెందన గంగారాం (26)కు క్యాసారం గంగూబాయ్, చిన్న గంగారాం కూతురు సుమలతను ఇచ్చి పెళ్లి చేశారు. అల్లుడు సోమవారం వరిచేలో పనిచేస్తున్న అత్త గంగాబాయ్‌ని గొడ్డలితో నరికి చంపాడు. అడ్డొచ్చిన మరదలు సుజాత మెడపై గొడ్డలితో వేటు వేశాడు.
గంగూబాయ్ అక్కడికక్కడే మరణించగా, సుజాత తీవ్రంగా గాయపడింది. సుజాత ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడినట్లు చెబుతున్నారు. పొలం నుంచి ఇంటికి వచ్చిన గంగారాం ఉరేసుకుని మరణించాడు. భార్య సుమలత తన ఏడాది కూతురు అక్షయను నిజామాబాద్ ఆస్పత్రికి వైద్యం కోసం తీసుకుని వెళ్లింది.
గంగారాం మామ కూడా నిజామాబాద్‌లోనే ఉన్నాడు. బీంగల్ సిఐ పురుషోత్తం, సిరికొండ ఎస్సై రాజశేఖర్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించి కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications