హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టెక్కీ ఆత్మహత్య: భర్త బంధువులపై భార్య నిందలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Techie suicide: Wife blames it on hubby’s kin
హైదరాబాద్: తన భర్త మృతిపై ఆయన బావపై సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అనిల్ కుమార్ భార్య స్వప్న ఆరోపణలు చేస్తోంది. అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చిన టెక్కీ అనిల్ కుమార్ కూకట్‌పల్లిలోని ఈనాడు కాలనీలో తన బావ, సోదరి ఇంటి ముందు కారులో మరణించిన విషయం తెలిసిందే. అతను క్యాబ్‌ అద్దెకు తీసుకుని అందులో ఆత్మహత్య చేసుకున్నాడని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అనిల్ బావ సురేష్ పాత్రపై స్వప్న అనుమానాలు వ్యక్తం చేస్తోంది.

తన భర్త మృతి విషయాన్ని తనకు సకాలంలో తెలియజేయలేదని, ఇందులో అనిల్ సోదరి, బావ పాత్ర అనుమానాస్పదంగా ఉందని స్పప్న సోమవారం మీడియా ప్రతినిధులతో చెప్పింది. హైదరాబాదులోని ఇంటలిజెన్స్ బ్యూరోలో సురేషథ్ ఆఫీస్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు.

సంఘటన జరిగిన సమయంలో స్పప్న నల్లగొండ జిల్లా కోదాడలోని తన తల్లిదండ్రుల నివాసంలో ఉంది. ఆదివారం రాత్రి హైదరాబాదుకు వచ్చింది. తన భర్త మరణ వార్తను తనకు సాయంత్రం 4.15 గంటలకు తెలియజేశారని ఆమె చెప్పింది. తన భర్త బావ, సోదరి పాత్రపై తాను పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపింది.

అయితే, తమకు ఏ విధమైన ఫిర్యాదు అందలేదని పోలీసులు అంటున్నారు. విషం తీసుకోవడం వల్ల అనిల్ మరణించినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైందని పోలీసులు అంటున్నారు. తమకు సూసైడ్ నోట్ కూడా దొరికిందని, అనిల్ భార్య నుంచి తమకు ఏ విధమైన ఫిర్యాదు అందలేదని వారు చెబుతున్నారు.

తమ కుమారుడు వైవాహిక జీవితంతో ఆనందంగా లేడని, అతని ఆత్మహత్యకు అదే కారణమని అనిల్ తల్లిదండ్రులు చెప్పారని, పెళ్లి సమయంలో స్వప్న కుటుంబ సభ్యులు 25 లక్షల రూపాయలు ఇచ్చారని, వాటిని తిరిగి ఇచ్చేయడానికి అనిల్ కుటుంబ సభ్యులు అంగీకరించారని అంటున్నారు. దాంతో ఇరు పక్షాల మధ్య రాజీ కుదిరినట్లు సమాచారం. అనిల్ కుమార్ శవాన్ని ఆదివారంనాడు అతని తల్లిదండ్రులకు అప్పగించారు.

English summary

 he widow of I Anil Kumar, the US-based techie, who committed suicide in front of his sister's house in Kukatpally, has alleged that the role of her husband's brother-in-law was suspicious in the entire episode. Anil was found dead in a cab in front of his brother-in-law Suresh's residence on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X