60 ఏళ్లుగా జరగంది ఇప్పుడా: హరీష్, విలీనంపై ఈటెల

జిల్లాలో 42 శాతం ఉద్యోగాలు నాన్ లోకల్స్‌కు కట్టబెట్టారని ఆరోపించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడులాగే వ్యవహరిస్తున్నారని, 610 జివోపై కమిటీ వేస్తానని ఇప్పటి వరకు వేయలేదన్నారు. తెలంగాణ ప్రాంతానికి న్యాయం జరగాలంటే ప్రత్యేక రాష్ట్రం మినహా మరో గత్యంతరం లేదన్నారు. అరవై ఏళ్లలో జరగని న్యాయం ఇప్పుడు జరుగుతుందా అన్నారు. కలిసున్నంత కాలం న్యాయం కోసం పోరాడటమే తప్ప తెలంగాణ ప్రజలకు మరొకటి లేకుండా పోతుందన్నారు.
తెలంగాణ తెచ్చుడో కెసిఆర్ చచ్చుడో అని పార్టీ అధ్యక్షుడు గతంలోనే ప్రకటించారని, అందుకోసమే పార్టీ ఉద్యమిస్తోందన్నారు. కిరణ్ ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే సత్తా లేదన్నారు. 1952లో ఇడ్లీ సాంబర్ గోబ్యాక్ అని తెలంగాణవాదులు ఉద్యమించారని, నాటి నుండి నేటి వరకు ఏదోరూపంలో ఉద్యమిస్తున్నారన్నారు. తెలంగాణ అమరవీరుల సాక్షిగా ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్తామన్నారు. తెలంగాణను సీమాంధ్ర నేతలు దోచుకున్నారన్నారు.
కాంగ్రెసులో తమ పార్టీ విలీనమవుతుందని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అవన్నీ ఊహాజనితమేనని మరో నేత ఈటెల రాజేందర్ వేరుగా అన్నారు. తెలంగాణ రాజకీయ సమితి ఇచ్చిన మార్చ్‌లో పాల్గొనే విషయమై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలు వెంటనే జరపాలని హైకోర్టు తీర్పునివ్వడం హర్షణీయమన్నారు. అదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని, తమ పార్టీ బృందం పర్యటించి సిఎంకి నివేదిక అందిస్తుందన్నారు.












Click it and Unblock the Notifications