తెలంగాణ: బాబుపై యుద్ధానికి సీమలీడర్స్, రిజైన్‌కు సై!

తన ఉద్యమంతో టిడిపికి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. చంద్రబాబు తెలంగాణకు అనుకూలంగా నిర్ణయాన్ని ప్రకటించిన పక్షంలో మరికొందరు నేతలు కూడా బైరెడ్డి దారిలో నడిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు. సెప్టెంబర్ రెండో వారంలో తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేస్తామని బాబు చెప్పిన నేపథ్యంలో సీమ నేతల్లో కలవరం ప్రారంభమైందట. ప్రస్తుత పరిస్థితుల్లో బాబు తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడంతో పాటు కేంద్రానికి లేఖను కూడా రాసేందుకు సిద్ధమవుతున్నారట.
అయితే రాయలసీమ నేతలు మాత్రం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవద్దని చంద్రబాబుపై ఒత్తిడి తీసుకు వస్తున్నట్లుగా సమాచారం. అలా చేస్తే సీమాంధ్రలో పార్టీ దారుణంగా దెబ్బ తింటుందని చెప్పి బాబు జోరుకు కళ్లెం వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. పయ్యావుల కేశవ్, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తదితరులు బాబుకు నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తున్నారట. అయితే తమ్ముళ్లు ఎంతగా చెప్పినప్పటికీ బాబు మాత్రం తెలంగాణపై వెనక్కి తగ్గక పోవచ్చుననే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
అదే జరిగితే సీమ ప్రాంతంలోని టిడిపి ప్రజాప్రతినిధుల్లో చాలామంది 2009లాగే రాజీనామాలకు సిద్ధపడే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. బాబు తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం ప్రకటించిన వెంటనే రాజీనామాలు చేసేందుకు చాలామంది రెడీగా ఉన్నారని అంటున్నారు. తెలంగాణపై బాబు జోరు టిడిపిలో మళ్లీ ముసలం పుట్టించనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంలో బాబు పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా తయారయింది.
సీమ నేతలు రాజీనామాలు చేసిన పక్షంలో చంద్రబాబు మరోసారి తెలంగాణను మోసగించేందుకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటూనే సీమాంధ్ర నేతలతో రాజీనామాలు చేయించి డబుల్ గేమ్ ఆడుతున్నారనే అపవాదు మోయాల్సి వస్తుంది. అలా జరగకుండా ఉండేందుకు బాబు కూడా సీమ నేతలను చల్లార్చేందుకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నార. మరి టిడిపిలో మళ్లీ ముసలం పుడుతుందా లేక బాబు నిర్ణయానికి తమ్ముళ్లు తలవంచుతారా అనేది ఖచ్చితంగా తెలియాలంటే సెప్టెంబర్ రెండోవారం చివరాఖరు వరకు ఆగాల్సిందే.












Click it and Unblock the Notifications