కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఒబామా భయపడుతున్నారు, గర్వంగా ఉంది: కిరణ్ రెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
కర్నూలు: మన దేశానికి చెందిన యువతను చూసి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామానే భయపడుతున్నారని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం అన్నారు. కర్నూలు జిల్లాలో రెండో రోజు ఇందిర బాటను కొనసాగించారు. ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం కావడంతో ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ... విద్యార్థులను సరైన బాటలో నడిపించేది కేవలం ఉపాధ్యాయుడు మాత్రమే అన్నారు. విద్యార్థులకు మన కుటుంబ వ్యవస్థ గురించి టీచర్లు చెప్పాలని సూచించారు.

చదువు అంటే మార్కులు కాదని ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోగలిగేలా ఉండాలని, అలా విద్యార్థులను తీర్చిదిద్దాలన్నారు. మన కుటుంబ వ్యవస్థ గురించి చెప్పాలన్నారు. సమాజాన్ని మార్చగలిగే శక్తి కేవలం టీచర్‌కే ఉందన్నారు. విద్యార్థులను సరైన బాటలో నడిపించాల్సిన బాధ్యత వారిపై ఉందని, విద్యార్థుల కంటే టీచర్ల వద్ద పదిరెట్ల సమాచారం ఎక్కువగా ఉండాలన్నారు. చైనా, భారత్ దేశాల యువత ఉద్యోగాలు తరలించుకు పోకుండా ఉండేలా అమెరికా యువత ఉండాలని ఆ దేశ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఉపదేశించారన్నారు.

భారత దేశ యువత అంటే ఒబామా భయపడే పరిస్థితి మన యువత తీసుకు వచ్చిందంటే అందుకు మనమంతా ఎంతో గర్వించాలన్నారు. విద్యకు మంచి పునాది ఉండాలని, నాణ్యమైన విద్యను టీచర్లు అందించాలని సూచించారు. మన దేశాన్ని యువత ప్రథమ స్థానంలో నిలబెడుతుందనే విశ్వాసాన్ని కిరణ్ వ్యక్తం చేశారు. ప్రపంచాన్ని జయించే శక్తి యువకులకు ఉందని, వారికి ఆ శక్తిని ఇచ్చేది మాత్రం టీచర్లే అన్నారు.

పేదరికాన్ని నిర్మూలించే శక్తి చదువుకు మాత్రమే ఉందన్నారు. ఈ విషయమై తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలని ఎమ్మెల్సీలను కోరినట్లు చెప్పారు. రైతుల గురించి మాట్లాడుతూ... వైపరీత్యాలు ఏర్పడితే వడ్డీ మాఫీ చేయాలని కేంద్రాన్ని కోరతామన్నారు. రైతు బంధం రుణపరిమితిని రూ.50 వేల నుండి రూ.లక్షకు పెంచుతున్నట్లు చెప్పారు.

English summary

 CM Kiran Kumar Reddy said on Wednesday that America president Barack Obama is fear of India and Chaina youth.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X