హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఈనెలలోనే తెలంగాణ తేలుతుంది, ఢిల్లీలో చర్చ: కెసిఆర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్/న్యూఢిల్లీ: తాను ఢిల్లీలో ఉన్న సమయంలో ఏదైనా జరగవచ్చునని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్‌నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు బుధవారం అన్నారు. ఆయన ఈ రోజు సాయంత్రం మూడు గంటలకు న్యూఢిల్లీకి బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తాను పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యేందుకే ఢిల్లీ వెళుతున్నానని, తన పర్యటనలో ఎలాంటి ప్రాధాన్యత, ప్రత్యేకత లేదన్నారు.

సెషన్స్‌కు మిస్ కావొద్దన్న ఉద్దేశ్యంతో చివరి రెండు రోజులు హాజరయ్యేందుకు వెళుతున్నానని చెప్పారు. ఈ నెలాఖరులోగా తెలంగాణపై ఏదో ఒకటి తేలుతుందని కెసిఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఢిల్లీలో తెలంగాణపై చర్చలు జరుగుతున్నాయన్నారు. ఢిల్లీలోతెలంగాణపై ఏదైనా జరిగే అవకాశముందని, తాను అక్కడ ఉండే సమయంలో చర్చలు జరిగే ఆస్కారముందన్నారు. తెలంగాణపై నెలాఖరులోగా మాత్రం తేలడం ఖాయమన్నారు.

ఆజాద్‌ను కలిసిన జెఏసి

కాగా న్యూఢిల్లీలో కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్‌ను తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి నేతలు కలిశారు. గత సంవత్సరం జరిగిన సకల జనుల సమ్మె సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని తాము ఆజాద్‌ను కోరినట్లు జెఏసి నేతలు తర్వాత చెప్పారు. తెలంగాణపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని తాము అతనికి విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. జెఏసి నేతలతో పాటు ఎంపీలు రాపోలు ఆనంద భాస్కర్, పాల్వాయి గోవర్ధన్ రెడ్డిలు కూడా ఆజాద్‌ను కలుసుకున్నారు.

తెలంగాణపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆజాద్... ఎంపీలతో, జెఏసి నేతలతో రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణకు జరిగిన అన్యాయంపై గణాంకాలతో కూడిన ఓ రిపోర్ట్ ఇవ్వాలని సూచించినట్లుగా తెలుస్తోంది. కాగా ఆజాద్ నివేదిక కోరడం చర్చనీయాంశమైంది.

English summary
Telangana Rastra Samithi president K Chandrasekhar Rao said on Wednesday that there is no importance to his New Delhi tour.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X