వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐఏఎస్‌గా ఉంటూ నటన వద్దు: అధికారికి హైకోర్టు షాక్

By Srinivas
|
Google Oneindia TeluguNews

High Court of Karnataka
బెంగళూరు: ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ సినిమాలలో నటించడం సరికాదని కర్నాటక అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు మంగళవారం తేల్చి చెప్పింది. కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు నటనను ఎంచుకోవడాన్ని కోర్టు తప్పు పట్టింది. హీరోగా మారిన కన్నడ ఐఏఎస్ అధికారి శివరాం దాఖలు చేసుకున్న రిట్ పిటీషన్‌ను కొట్టేస్తూ సంచలన తీర్పునిచ్చింది. నటన లేదా ఉద్యోగం ఏదో ఒక్కటి తేల్చుకోవాలని స్పష్టం చేసింది.

ఐఏఎస్, కెఏఎస్ అధికారులు సినిమాల్లో నటించడం కుదరదని గతంలో ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది. ఈ సర్క్యులర్‌ను 2004లో అప్పటి ఎస్ఎం కృష్ణ ప్రభుత్వం జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ సినీ హీరో శివరాం హైకోర్టు సింగిల్ బెంచ్‌కు అప్పీల్ చేశారు. అక్కడ అతడికి చుక్కెదురయ్యింది. అతడి పిటీషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. దీంతో డివిజనల్ బెంచ్‌కు మళ్ళీ అప్పీల్ చేసుకున్నారు.

దీనిపై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తులు మరోమారు శివరాంకు షాక్ ఇచ్చారు. ప్రభుత్వ సర్క్యులర్‌ను రద్దు చేయాలంటూ శివరాం దాఖలు చేసుకున్న పిటీషన్‌ను న్యాయమూర్తి ఆనంద్ బైరారెడ్డి తోసిపుచ్చారు. ఐఏఎస్ అధికారులుగా ప్రజా సమస్యలపై స్పందించాల్సిన తరుణంలో సెలవులు పెట్టి సినిమాలలో నటించడం ఎంతవరకు సబబని న్యాయమూర్తులు ప్రశ్నించారు.

కాగా హైకోర్టు తీర్పును శివరాం సుప్రీం కోర్టులో సవాల్ చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. ప్రస్తుతం శివరాం పలు కన్నడ సినిమాలలో నటించాడు. ఇతను సోషల్ వెల్ఫేర్ కమిషనర్‌గా పని చేశారు.

English summary
The Karnataka High Court today dismissed a writ petition by an IAS officer challenging a Government order barring officials from acting in films.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X