చొక్కాలు పట్టుకొని..: సభలో ఎస్పీ, బిఎస్పీ ఫైటింగ్ సీన్

బిఎస్పీ ఎస్పీ వైఖరిని తప్పు పట్టింది. దీంతో ఇరు పార్టీల ఎంపీల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఓ సమయంలో ఒకరి చేతిలోని బిల్లు ప్రతులను మరొకరు లాక్కొని చించేసే ప్రయత్నాలు చేశారు. ఒకరి చొక్కాలు మరొకరు పట్టుకున్నారు. బాహాబాహీకి దిగారు. దీంతో రాజ్యసభలో ఫైటింగ్ సీన్ స్పష్టంగా కనిపించింది. దీంతో రాజ్యసభ చైర్మన్ సభను రెండు గంటల వరకు వాయిదా వేశారు.
బొగ్గు కుంభకోణంపై రగడ జరుగుతుండగా ఎస్సీ, ఎస్టీ ప్రమోషన్ బిల్లు ప్రవేశ పెట్టడాన్ని ఎస్పీ తీవ్రంగా ఖండించింది. బొగ్గు స్కాం 2జి కంటే పెద్దదని కాగ్ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో దీనిపై చర్చించాలని విపక్షాలు పట్టుబడుతుండగా దాని నుండి తప్పించుకునేందుకే ప్రభుత్వం ఈ ప్రమోషన్ బిల్లును ప్రవేశ పెట్టే ప్రయత్నాలు చేస్తోందని మండిపడ్డారు.
బిఎస్పీ ఎంపీ అవతార్ సింగ్, ఎస్పీ ఎంపి నరేష్ అగర్వాల్ మధ్య తొలుత ఈ ప్రమోషన్ బిల్లు పైన వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం ఇరుపార్టీల ప్రతినిధులు రణరంగాన్ని తలపించేలా చేశారు.












Click it and Unblock the Notifications