జగన్ సవాల్‌కు బాబు నో, పిసినారితనం..: విజయమ్మ

కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం నాటి వైయస్ ప్రభుత్వంలా విద్యార్థులకు ఫీజులు చెల్లిస్తుందా గుండెమీద చేయి వేసుకొని కాంగ్రెసు నేతలు చెప్పాలని ఆమె సవాల్ విసిరారు. ఆయన సాచురేషన్ ప్రకారం రీయింబర్సుమెంట్స్ ఇచ్చారని, కానీ ఈ ప్రభుత్వం మాత్రం సాచురేషన్ పద్ధతికి మంగళం పాడుతోందన్నారు. కాంగ్రెసు నేతలు జేబుల నుండి ఇస్తున్నట్లుగా పిసినారితనం చూపిస్తున్నారని మండిపడ్డారు. వైయస్ జీవించి ఉంటే ఫీజులపై వెనక్కి తగ్గే వారు కాదని, ఆయన ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే ఆపే సమస్య ఉండదన్నారు.త
ఆయన ఆలోచించిన ప్రకారమే ఈ మూడేళ్లలో జరిగితే సామాజిక విప్లవం వచ్చి ఉండేదన్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఫీజు రీయింబర్సుమెంట్స్ పథకాన్ని తాను ప్రారంభించానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. బిసిలకు వంద సీట్లు ఇస్తామని బాబు చెబుతున్నారని, కానీ ఆయన మాటలను ఎవరూ నమ్మడం లేదన్నారు. 2009లో వంద సీట్లు కేటాయిస్తామని చెప్పి కేవలం 45 మాత్రమే ఇచ్చారని, అదే వైయస్ చెప్పకుండానే 67 ఇచ్చారన్నారు. చంద్రబాబు వైయస్ పథకాలు కాపీ కొట్టడంలో బిజీగా ఉన్నారన్నారు.
తన తనయుడు, పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి.. బిసిలకు వంద టిక్కెట్లు కాదు, వంద సీట్లలో గెలిపిద్దాం రమ్మని చెబితే బాబు స్పందించే స్థితిలో లేరని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాలు కలిసిపోయాయని, ఇది ఇటీవల జరిగిన ఉప ఎన్నికలలో రుజువైందన్నారు. ఆ రెండు పార్టీలో చెరి కొన్ని నియోజకవర్గాలలో డిపాజిట్లు దక్కించుకున్నాయని గుర్తు చేశారు. జగన్ ఉండి ఉంటే మీ మధ్య ఉండేవాడని, త్వరలో ఆయన బయటకు వస్తాడని, మీ మధ్యే ఉంటారని చెప్పారు.
జగన్ వచ్చాక దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ప్రవేశ పెట్టిన పథకాలను అమలుపరుస్తారని చెప్పారు. గత సంవత్సరం జగన్ ఇక్కడే విద్యార్థుల కోసం వారం రోజులు దీక్ష చేశారని, తాను వద్దని నచ్చజెప్పినప్పటికీ ఎంతోమంది తల్లిదండ్రుల కష్టం తీరుతుంటే తన దీక్షను వద్దనటం సరికాదని తనకు జగన్ చెప్పాడని ఆమె అన్నారు. పెద్ద చదువులు చదవడం పేదలందరి హక్కు అన్నారు.












Click it and Unblock the Notifications