23 మంది ఇండియన్స్‌తో కూడిన నౌక హైజాక్, విడుదల

సింగపూర్‌కి చెందిన ఎంటి అబుధాబి స్టార్ అనే ఓడ ఆయిల్‌ను తీసుకెళ్తుండగా మంగళవారం సాయంత్రం హైజాక్‌కు గురైందని ఇంటర్నేషనల్ మారిటైమ్ బ్యూరో(ఐఎంబి) అధికారులు తెలిపారు. సముద్ర దొంగలు దాడి చేసినట్టుగా సిబ్బందిలో ఒకరు సమాచారం అందించారని ఆయిల్ ట్యాంకర్ కంపెనీ ప్రతినిధి తెలిపారు.
హైజాక్‌కు పాల్పడింది నైజీరియాలోని నైజర్ డెల్టా ప్రాంతానికి చెందిన చమురు దొంగలుగా అనుమానిస్తున్నారు. ఈ నౌక గ్యాసోలీన్ అనే ఇంధనాన్ని తీసుకు వెళుతుండగా గినియా జలసంధి సమీపంలోని లాగోస్ సముద్ర జలాల్లో నైజీరియన్ పైరేట్లు హైజాక్ చేశారు. వీరిని రక్షించింది నైజీరియన్ నౌకా దళ సిబ్బందే.












Click it and Unblock the Notifications