వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కుట్రతోనే జెడి కాల్‌లిస్ట్ సేకరణ: రఘురామపై సిఐడి

By Srinivas
|
Google Oneindia TeluguNews

CBI JD Laxmi Narayana
హైదరాబాద్: సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ కాల్‌లిస్టు లీకేజీ కేసులో ప్రధాన నిందితుడు రఘురామకృష్ణరాజుకు సెషన్స్ కోర్టు ఇచ్చిన ముందస్తు బెయిలు రద్దు చేయాలని సిఐడి హైకోర్టును ఆశ్రయించింది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తులు, కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి ఓఎంసి, ఎమ్మార్ వంటి కీలకమైన కేసులను దర్యాప్తు చేస్తున్న లక్ష్మీనారాయణను నైతికంగా దెబ్బతీసేందుకు రఘురామరాజు మరికొందరితో కుట్రపన్ని అక్రమంగా జెడి కాల్ లిస్టును సేకరించారని కోర్టు దృష్టికి తెచ్చింది.

ఈ కేసులో రఘురామరాజు పాత్రను వివరిస్తూ, అయన బెయిల్‌ను రద్దు చేయాలని సిఐడి ఎస్పీ రామకృష్ణయ్య పిటిషన్ దాఖలు చేశారు. మహారాష్ట్ర నాందేడ్ జిల్లాలోని ముఖీద్ పోలీసు స్టేషన్‌లో తప్పుడు ఫిర్యాదుచేసి సిబిఐ జెడి కాల్‌డేటాను రఘురామరాజు తన అనుచరుల ద్వారా సేకరించారని, దాని ఆధారంగా మీడియాలోని ఓ వర్గానికి దర్యాప్తు వివరాలను జెడి లీక్ చేస్తున్నారంటూ హైకోర్టులో పిటిషన్ వేసినట్లు గుర్తు చేశారు.

జగన్ మీడియా ద్వారా కాల్ లిస్టులోని వివరాలను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు ప్రచారం చేశారని తెలిపారు. సిబిఐ జెడిఫిర్యాదు మేరకు వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారని, ఈ కేసులో నిందితుడు కె.వి. రెడ్డిని విచారిస్తే కుట్ర బయట పడిందని పిటిషన్‌లో సిఐడి పేర్కొంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన రఘురాజు కుటుంబంతో సహా సింగపూర్‌కు పారిపోయారని, ఆయనపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశామని వివరించారు.

విచారణకు సహకరిస్తానంటూ సెషన్స్‌ కోర్టును తప్పుదోవపట్టించి తన న్యాయవాది ద్వారా ముందస్తు బెయిలు పొందారని, అనంతరం లుక్ అవుట్ నోటీసులు ఉపసంహరించేలా ఆదేశాలు తెచ్చుకున్నారని తెలిపింది. సింగపూర్ పారిపోయిన విషయాన్ని కోర్టుకు తెలపలేదని, మొదటి నుంచి ఆయన దర్యాప్తునకు సహకరించడం లేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆయనకు కింది కోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని ఆభ్యర్థించింది.

English summary
CID appealed in High Court that to cancel Raghurama Krishnam Raju bail for he is not co-operating in CBI JD Laxmi Narayana call list case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X