జగన్ అవినీతిపై దీక్ష చేయండి: విజయమ్మకు వీరశివ

Veerasiva Reddy
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవ అధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మ ఫీజు రీయింబర్సుమెంట్స్ దీక్ష పైన కాంగ్రెసు పార్టీ కమలాపురం ఎమ్మెల్యే వీరశివా రెడ్డి మండిపడ్డారు. విజయమ్మ రాజకీయ లబ్ధి కోసం సిరిసిల్ల నేత దీక్ష, విద్యుత్ కోతలను నిరసిస్తూ కరెంటు దీక్ష, ఇప్పుడు ఫీజు దీక్షలు అంటున్నారని విమర్శించారు.

విజయమ్మ వీటిపై కాకుండా అవినీతిపై దీక్ష చేస్తే మంచిదని ఆయన సూచించారు. మీ వాకిట్లో మొలిచిన అవినీతి మొక్కలను తొలగించేందుకు దానికి వ్యతిరేకంగా దీక్ష చేస్తే అందరూ సంతోషిస్తారని ఎద్దేవా చేశారు. అంతేకాకుండా వైయస్ జగన్మోహన్ రెడ్డి కట్టించిన రాజసౌధాలన్నీ యువజన, శ్రామిక, రైతులకు పంచిపెట్టాలన్నారు.

బెంగుళూరు నుంచి హైదరాబాద్‌లోని రాజభవంతులు, పులివెందులలోని అత్యాధునిక భవంతి, సాక్షి పత్రిక, టీవీ, భారతీ సిమెంట్ ఇలాంటి స్థిర, చరాస్తులన్నింటిని మీ రాజకీయ పార్టీలో ఉన్న యువజన, శ్రామిక, రైతులకు పంచిపెడితే అందరికీ ఒక దారి చూపినట్లుగా ఉంటుందని పేర్కొన్నారు.

కాంగ్రెస్ శాసనసభాపక్ష కార్యాలయంలో ప్రభుత్వ చీఫ్‌విప్ గండ్ర వెంకట రమణారెడ్డి, విప్‌లు ఆరేపల్లి మోహన్, రుద్రరాజు పద్మరాజు, వీరశివా రెడ్డి విలేకరులతో మాట్లాడారు. నిబంధనల మేరకు ఫీజులను నిర్ధారిస్తే.. విజయలక్ష్మి రాజకీయ ప్రయోజనం కోసం ఫీజు దీక్షను చేపట్టారని ఆరోపించారు. విద్యార్ధులకు మేలైన విద్యను అందించేందుకు వీలుగా సర్కారు చర్యలు తీసుకుంటుంటే.. ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధి కోసం ఆందోళనలు చేపట్టడం సరికాదని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+