అవకాశమే లేదు: మన్మోహన్ సింగ్‌కు కోపమొచ్చింది

Manmohan Singh
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు కోపమొచ్చింది! శుక్రవారం పార్లమెంటు ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడిన అనంతరం మన్మోహన్ మీడియాతో మాట్లాడారు. పార్లమెంటులో ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ అవలంభించిన తీరుపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశాలను అడ్డుకోవడం సరికాదని, బిజెపి తీరు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని అన్నారు. సమావేశాలు సజావుగా సాగేందుకు బిజెపి సహకరించాల్సి ఉండెనన్నారు.

పార్లమెంటులో ప్రజావాణిని వినిపించే అవకాశం లేకుండా చేశారని, ప్రజా సమస్యలపై చర్చించే అవకాశమే ఇవ్వడం లేదన్నారు. కాగ్ లేవనెత్తిన భూకేటాయింపులపై సభలో చర్చ జరగాలన్నారు. కానీ బిజెపి తీరుతో అది జరగలేదన్నారు. కాగ్ పైన తమకు ఎనలేని గౌరవం ఉందని, అందుకే చర్చకు అంగీకరించామని, బిజెపి మాత్రం కేవలం రాజీనామాపై డిమాండ్ చేస్తూ సమావేశాలను పూర్తిగా స్తంభింప చేశాయని ఆరోపించారు.

కాగా బొగ్గు నిల్వల కుంభకోణానికి బాధ్యత వహిస్తూ ప్రధాని రాజీనామా చేయాలనే డిమాండ్‌తో వర్షాకాల సమావేశాలను బిజెపి స్తంభింప చేసిన విషయం తెలిసిందే. పార్లమెంటు సమావేశాలు 13 రోజులు జరిగాయి. కానీ ఒక్కరోజు కూడా ఇరు సభలు సజావుగా సాగలేదు. బొగ్గు స్కాం వ్యవహారంలో ప్రధాని రాజీనామా చేశాకే చర్చ పెట్టాలని బిజెపి డిమాండ్ చేయగా, ప్రధాని మాత్రం రాజీనామా చేసే ప్రసక్తి లేదని కాంగ్రెసు కుండబద్దలు కొట్టడంతో సెషన్స్ ఎలాంటి ప్రజా సమస్యలపై చర్చ జరగకుండానే ముగిశాయి.

కాగా పార్లమెంటు సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. సమావేశాల చివరి రోజు కూడా బొగ్గు కుంభకోణం ప్రకంపనలే కొనసాగాయి. బొగ్గు కేటాయింపులు తక్షణం రద్దు చేయాలని బిజెపి సభ్యులు ఉభయ సభల్లో ఆందోళనకు దిగారు. ప్రధాని రాజీనామాకు పట్టుబట్టారు. వెల్‌లోకి దూసుకు వెళ్లారు. దీంతో శుక్రవారం ఇరు సభలు మొదలైన కాసేపటికే మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి. ఆ తర్వాత నిరవధికంగా వాయిదా పడ్డాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+