భారీ విధ్వంసానికి టెర్రరిస్ట్స్ కుట్ర: వెల్లడించిన ఒబేద్

మత విధ్వేషాలు రెచ్చగొట్టేందుకు హైదరాబాదులోని పాతబస్తీ సహా ధనవంతులు ఉండే బంజారాహిల్స్ తదితర ప్రాంతాలలో విధ్వంసానికి కుట్ర చేశారు. ఇందుకోసం పాతబస్తీలో మూడుసార్లు, బంజారాహిల్సులో నాలుగుసార్లు రెక్కీ కూడా నిర్వహించారు. నలుగుర ఉగ్రవాదులు కలిసి హైదరాబాదులోని వివిధ ప్రదేశాలలో రక్కీ నిర్వహించారు. దీంతో పాటు హైదరాబాదులోని ప్రముఖ హిందీ నేతలను కూడా వారు టార్గెట్ చేసుకున్నారు.
ఒబేద్ ఇచ్చిన సమాచారం మేరకు హైదరాబాదులో మరో ఇద్దరు లేదా ముగ్గురు తీవ్రవాదులు ఉన్నారు. వారిని ట్రాప్ చేసేందుకు బెంగళూరుతో పాటు మన రాష్ట్రానికి చెందిన పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అరెస్టు చేసిన వారికి ఐఎస్ఐ లింక్స్ ఉన్నట్లు బెంగళూరు పోలీసులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఒబేద్‌ను దుబాయ్ వెళ్లడానికి రెండు రోజుల ముందు పోలీసులు అరెస్టు చేశారు. అతనిని విచారించిన పోలీసులు కీలక సమాచారం తెలుసుకున్నారు.
అరెస్టయిన వారికి ఇండియన్ ముజాహిద్దీన్, లష్కరే తోయిబా సంస్థలతో సంబంధాలు ఉన్నట్లు బెంగళూరు పోలీసులు గుర్తించారు. హైదరాబాదులో రెక్కీ నిర్వహించిన నలుగురు పాతబస్తీలోనే ఉండి.. ఓ ఇంటర్ నెట్ సెంటర్ వద్ద కలుసుకునే వారట. అదే ప్రాంతానికి చెందిన నేతలను వారు కలుసుకునే ప్రయత్నం చేశారని తెలుస్తోంది. అయితే ఆ నేత అందుకు అప్పుడు నిరాకరించారట. దీంతో వారు అక్కడ నుండి వెళ్లిపోయారని సమాచారం.












Click it and Unblock the Notifications