వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనాలో భూకంపం: 50 మంది మృతి, విధ్వంసం

By Pratap
|
Google Oneindia TeluguNews

Earthquake
బీజింగ్: చైనాను భారీ భూకంపం తాకింది. భూకంపం తర్వాత ప్రకంపనలు కూడా పెద్ద యెత్తున చోటు చేసుకున్నాయి. దీంతో దాదాపు 50 మంది మరణించారు. 150 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. కొండలు విరిగిపడడంతో, వేలాది ఇళ్లు కూలండంతో భారీ విధ్వంసం సంభవించింది. యున్నాన్ ప్రొవిన్స్‌లోని యిలియాంగ్ ప్రాంతం సరిహద్దులో, పొరుగునే ఉన్న గుయూజోవౌలో స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 11.19 గంటలకు భూకంపం వచ్చినట్లు చైనా భూకంపాల వ్యవస్థ కేంద్రం తెలిపింది.

ఈ భూకంపం రిక్టర్ స్కేలుపై 5.7గా నమోదైంది. ఝావోటోంగ్ నగర కేంద్రానికి 33 కిలోమీటర్ల దూరంలోని లుయజోహె కేంద్రంగా భూకంపం వచ్చింది. యిలియాంగ్‌లో 49 మంది మరణించగా, ఝవోటోంగ్‌లో ఒకరు మరణించినట్లు సమాచారం. మృతుల సంఖ్య పెరగవచ్చునని భావిస్తున్నారు. సహాయక బృందాలు భూకంపం తాకిన మరిన్ని గ్రామాలను చేరుకోవాల్సి ఉంది.

రోడ్లపై కొండ చరియలు విరిగి రాళ్లు పడడంతో కొన్ని గ్రామాలకు చేరుకోవడానికి సాధ్యం కావడం లేదు. భూకంప తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో విద్యుత్తు, కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బ తిన్నాయి. భూకంపం తర్వాత స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో 16 ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.

భూకంపం ప్రభావం ఏడు లక్షల మందిపై పడింది. దాదాపు లక్ష మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇరవై వేలకు పైగా ఇళ్లు పూర్తిగా కూలిపోవడమో, ధ్వంసం కావడమో జరిగింది.

English summary
At least 50 people were killed and thousands rendered homeless when two earthquakes hit southwestern China today, according to the Xinhua news agency.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X