విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లగడపాటి జవాబు చెప్పాల్సిందే: వల్లభనేని వంశీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Vallabhaneni Vamsi
విజయవాడ: గట్టు భీమవరం దగ్గర టోల్‌ప్లాజా ఏర్పాటు విషయంలో విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పి తీరాలని అర్బన్ తెలుగుదేశం పార్టీ విజయవాడ అర్బన్ అధ్యక్షుడు వల్లభనేని వంశీమోహన్ అన్నారు. టోల్‌ప్లాజాపై తాము చేపట్టిన దీక్షలకు మద్దతుగా స్థానికంగా అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా వచ్చి పాల్గొంటున్నా లగడపాటి రాజగోపాల్ తప్పించుకు తిరగటం భావ్యం కాదన్నారు.

హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చే జాతీయరహదారిపై నందిగామ సమీపంలో కీసర దగ్గర ఇప్పిటికే ఒక టోల్‌ప్లాజా ఏర్పాటై ఉందని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా 25 కిలోమీటర్ల దూరంలో వత్సవాయి మండలం గట్టు భీమవరంలో జీఎంఆర్ సంస్థ మళ్లీ టోల్‌ప్లాజా ఏర్పాటు చేస్తోందన్నారు. హైవే నిబంధనల ప్రకారం 60 కిలోమీటర్ల దూరంలో మాత్రమే టోల్‌ప్లాజా ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. 25 కిలోమీటర్ల స్వల్ప దూరంలోనే మరో టోల్‌గేటు ఏర్పాటు చేయటం ద్వారా జగ్గయ్యపేట నుంచి విజయవాడ వచ్చే వారికి పెనుభారంగా మారిందన్నారు.

జగ్గయ్యపేట ఆర్టీసీ డిపో ఇప్పటికే నష్టాల బాటలో ఉందని, క కిలో మీటరుకు ఆరు రూపాయలు వసూలు చేస్తున్నారని అన్నారు. తాజా టోల్‌గేట్ వల్ల చార్జీలు ప్రయాణికులకు అందుబాటులో ఉండవన్నారు. ఎన్నో సమస్యలతో జగ్గయ్యపేట ప్రాంత వాసులు బాదలు పడుతుంటే ఎంపీ రాజగోపాల్‌కు ఏమాత్రం పట్టడం లేదని ఆయన అన్నారు. టోల్ ప్లాజా ఏర్పాటుకు సంబంధించి తాము జీఎంఆర్ సంస్థపై న్యాయపోరాటాన్ని కొనసాగిస్తున్నామని చెప్పారు.

నాగార్జున సాగర్ నుంచి డె ల్టాకు సాగు, తాగు నీటిని విడుదల చేయాలంటూ శనివారం ఉదయం టీడీపీ నేత వల్లభనేని వంశీ హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్‌ను దాఖలు చేశారు. సోమవారం సీజే బెంచ్‌లో ఈ పిటిషన్‌పై విచారణ జరగనుంది.

English summary
Telugudesam Vijayawada urban president Vallabhaneni Vamsi demanded MP Lagadapati Rajagopal reply on toll plaza near Gattu - Bheemavaram.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X