ముగ్గురిని కాల్చేసి చంపారు, తమను కాల్చుకున్నారు

New Delhi
న్యూఢిల్లీ: ప్రియురాలు కాకపోయినా, ఆమె చెల్లి కూడా దక్కలేదన్న కోపంతో దేశ రాజధాని ఢిల్లీలో ఓ యువకుడు కాల్పులు జరిపి నలుగురిని చంపి తానూ కాల్చుకున్న సంఘటన మరువక ముందే ఇలాంటిదే మరో దారుణం శుక్రవారం సాయంత్రం జరిగింది. సొంత భార్య, పిల్లలు, తమ్ముడిపైనే ఓ వ్యక్తి విచ్చలవిడిగా కాల్పులు జరిపి, ఒక కుమార్తెను బలిగొనగా, మరో యువకుడు తన స్నేహితురాళ్లను కాల్చి చంపాడు.

తర్వాత ఇద్దరూ తమను తాము కాల్చుకోగా వారిలో ఒకరు మరణించారు, మరొకరు చావుబతుకుల్లో ఉన్నారు. వాయవ్య ఢిల్లీలోని స్వరూప్‌నగర్‌లో సాయంత్రం ఐదు గంటల సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. మనీష్(25), రాజ్‌వీర్(32) ఓ మోటార్ సైకిల్‌పై వచ్చి, ముందుగా రాజ్‌వీర్ సోదరుడు క్రిషన్‌పై కాల్పులు జరిపారు.

తర్వాత మనీష్ స్నేహితురాలు జ్యోతి (23)పై కాల్పులు జరపగా ఆమె మరణించింది. తర్వాత రాజ్‌వీర్ స్నేహితురాలు ఉషా యాదవ్ (25)అనే ఉపాధ్యాయురాలినీ కాల్చి చంపారు. అక్కడి నుంచి రాజ్‌వీర్ తన ఇంటికి వెళ్లి భార్య పూజ, కుమార్తెలు ఖుషీ, రాశిలను కాల్చాడు.

దీంతో ఖుషీ మరణించగా.. పూజ, రాశి తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. తర్వాత రాజ్‌వీర్, మనీష్ తమను తాము కాల్చుకున్నారు. వారిలో రాజ్‌వీర్ చనిపోగా, మనీష్ చావుబతుకుల్లో ఉన్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+