'విలీనం' రగడ: విజయమ్మ వ్యాఖ్యల టేప్ రిలీజ్

దీనిని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు ఖండించారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుట్ర ఇందులో ఉందని ఆరోపించారు. తమ పార్టీకి లభిస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక కాంగ్రెసు, టిడిపిలు కలిసి ఈ కుట్రకు తెరలేపాయన్నారు. పిటిఐ లాంటి సంస్థ ఇలా చేయడం సరికాదని జగన్ పార్టీ నేతలు మండిపడ్డారు. దీంతో పిటిఐ విజయమ్మ చేసిన ఆ వ్యాఖ్యల సిడిని ఆదివారం యుట్యూబ్‌లో పెట్టింది.
ఈ సందర్భంగా పిటిఐ ప్రతినిధి మాట్లాడుతూ... మీరు కాంగ్రెసుతో చేతులు కలుపుతారని మీ పార్టీపై అనుమానాలు ఉన్నాయని, విలీనం చేస్తారా లేక పొత్తు పెట్టుకుంటారా అని ప్రశ్నించారు.
అందుకు విజయమ్మ ఫ్యూచర్ నిర్ణయిస్తుంది, ఫ్యూచర్ నిర్ణయిస్తుందండీ అని చెప్పారు.
దానికి పిటిఐ ప్రతినిధి దాన్ని మీరు తోసి పుచ్చడం లేదా అని ప్రశ్నించారు.
అందుకు విజయమ్మ జగన్ బాబు మతతత్వ పార్టీలకు మద్దతివ్వనని చెప్పాడని, ఫ్యూచర్ నిర్ణయిస్తుందని చెప్పారు.
ఆ తర్వాత పిటిఐ ప్రతినిధి థ్యాంక్యూ చెప్పారు.
కాగా ఈ వీడియో యూట్యూబ్‌లో పిటిఐ పెట్టినట్లుగా ప్రముఖ తెలుగు చానల్ ఎబిఎన్ ఆంధ్రజ్యోతిలో వార్త వచ్చింది. విజయమ్మ 'విలీనం' వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం తెలిసిందే.