వైఎస్ కోసమే చేరా, జగన్‌ను సిఎం చేస్తాం: ఉప్పునూతల

తమ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ ఉపన్యాసాలకు కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ నేతలు వణుకుతున్నారన్నారు. గడపగడపకు వైయస్సార్ కాంగ్రెసును తీసుకు వెళ్తామని చెప్పారు. జగన్‌ను ముఖ్యమంత్రి చేసే వరకు తాను పోరాటం చేస్తానని చెప్పారు. అనంతరం వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. తమ పార్టీని కార్యకర్తలే నడిపిస్తున్నారన్నారు. పార్టీకి వారే కొండంత అండ దండ అన్నారు.
ఈ రోజు ఉప్పునూతల తమ పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉందన్నారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు కుమ్మక్కై పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని జైలులో పెట్టారన్నారు. ఎప్పుడు ఎలాంటి ఎన్నికలు వచ్చినా తమ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. త్వరలో జగన్ బయటకు వస్తారని, దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి హయాం నాటి సువర్ణయుగం వస్తుందని అన్నారు.
కాగా నల్గొండ జిల్లాలో ఉప్పునూతల ముఖ్య నేత. ఆలేరు, భువనగిరి, తుంగతుర్తిలలో పట్టు ఉంది. దీంతో అక్కడ కాంగ్రెసు పార్టీకి ఎదురు దెబ్బ తగులుతుందని అంటున్నారు. మరోవైపు ఉప్పునూతల జగన్ పార్టీలో చేరినప్పటికీ ఆయన వెంట ప్రధాన నేతలు ఎవరూ వెళ్లడం లేదని, కొందరు కిందిస్థాయి వారే వెళుతున్నారని, అలాంటప్పుడు అక్కడ తమ పార్టీకి ఎలాంటి నష్టం లేదని కాంగ్రెసు చెబుతోంది.












Click it and Unblock the Notifications