హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ వల్ల.. తెలంగాణ ఇవ్వకుంటే: లగడపాటి X వివేక్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Lagadapati Rajagopal - Vivek
హైదరాబాద్: విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్‌కు, పెద్దపల్లి ఎంపీ వివేక్‌కు మధ్య సోమవారం ఉదయం లేక్ వ్యూ అతిథి గృహం వద్ద కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. వీరిరువురు నేతలు కేంద్రమంత్రి గులాం నబీ ఆజాద్‌ను కలిసేందుకు వచ్చారు. ఈ సందర్భంగా అతిథి గృహం వద్ద వారిద్దరూ తెలంగాణ, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అంశంపై వాగ్వాదం జరిగింది.

తెలంగాణ ఇవ్వకపోతే పార్టీకి చాలా నష్టమని లగడపాటితో వివేక్ చెప్పారు. తెలంగాణ ఇస్తేనే కష్టమని అందుకు జవాబుగా లగడపాటి అన్నారు. తెలంగాణను మీరు ఎందుకు అడ్డుకుంటున్నారని వివేక్ ప్రశ్నించగా.. మేం అడ్డుకోవడం కాదని తమ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని చెబుతున్నామని తెలిపారు. వైయస్ జగన్ వల్లనే పార్టీకి తీవ్రంగా నష్టం జరుగుతోందని వివేక్ చెప్పగా... తెలంగాణ ఇవ్వకుండా జగన్‌ను ఎదుర్కోవడం ఏమంత కష్టం కాదని, అలా అయితే రానున్న సాధారణ ఎన్నికలలో రాష్ట్రం నుండి 40 ఎంపీ స్థానాలు గెలుచుకోవచ్చునని లగడపాటి సమాధానమిచ్చారు.

అనంతరం వీరిద్దరు ఆజాద్‌ను వేర్వేరుగా కలిశారు. పార్టీ సీనియర్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి ఆజాద్‌ను కలిసిన అనంతరం మాట్లాడుతూ.. కేబినెట్లో కోవర్టులు అన్న వ్యాఖ్యలపై ఆజాద్ వివరణ కోరారని చెప్పారు. జరిగిన విషయాలను తాను వివరించినట్లు చెప్పారు. పార్టీ కోసం కష్టపడిన వారికే నామినేటెడ్ పోస్టులను ఇవ్వాలని కోరినట్లు చెప్పారు.

ఆజాద్‌ను కలిసిన వారిలో మంత్రులు దానం నాగేందర్, వట్టి వసంత్ కుమార్, డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క, యువజన కాంగ్రెసు నేత సుధాకర్ బాబు తదితరులు కలిశారు. కాగా నేతలతో భేటీ అనంతరం ఆజాద్ ముఖ్యమంత్రి కిరణ్, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణతో కలిసి భూదాన్ పోచంపల్లికి బయలుదేరారు.

English summary
Congress MPs Lagadapati Rajagopal and Vivek talk about Telangana and YS Jagagnmohan Reddy issues with central minister Ghulam Nabi Azad on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X