వైయస్ వల్లే రాష్ట్రం ఇలా, ఊహాగానాల డైరీ: సోమిరెడ్డి

రాష్ట్రం పూర్తిగా ఇంతలా అవినీతిలో కూరుకు పోవడానికి దివంగత వైయస్ రాజశేఖర రెడ్డియే కారణమన్నారు. కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు రాష్ట్ర ప్రజలను మరోసారి మోసం చేసి అధికారాన్ని కొట్టేయాలని చూస్తున్నాయని మండిపడ్డారు. ఆ రెండు పార్టీలు అంతర్గతంగా ఒకటేనని విమర్శించారు. రాష్ట్రంలో గత ఎనిమిదేళ్లలో అవినీతి బాగా పెరిగిపోయిందని, భారీగా ప్రజాధనం దుర్వినియోగం అయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా అంతకుముందు రోజు(శనివారం) తాను చేసిన వ్యాఖ్యలను సోమిరెడ్డి ఉపసంహరించుకున్నారు. మంత్రులు బలిపశువులు కాదని, బలిసిన పశువులు అని తాను వాడిన పదాలను వెనక్కి తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ పదాలను తాను వాడకుండా ఉండాల్సిందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ వచ్చే విధంగా తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తారని టిడిపి తెలంగాణ ఫోరం కన్వీనర్, పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు వేరుగా అన్నారు. ఆదివారం వరంగల్ దేవరుప్పుల వాగుపై బ్రిడ్జి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటు విషయంలో చంద్రబాబు త్వరలోనే తన నిర్ణయాన్ని వెల్లడిస్తారని తెలిపారు. తెరాస, టిడిపిలపై కాంగ్రెస్ పార్టీ బురదచల్లే ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. తెలంగాణ ఇచ్చేవిషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే కాలయాపన చేస్తున్నదని ఆరోపించారు.












Click it and Unblock the Notifications