హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పులిపై కెసిఆర్ స్వారీ: టిజి, తెలంగాణ ఆగదు: పాల్వాయి

By Pratap
|
Google Oneindia TeluguNews

TG Venkatesh
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు పులి మీద స్వారీ చేస్తున్నారని రాష్ట్ర చిన్ని నీటిపారుదల శాఖ మంత్రి టిజి వెంకటేష్ వ్యాఖ్యానించారు. కెసిఆర్ ఢిల్లీ నుంచి రాగానే తాము సమైక్య రాష్ట్రం కోసం ఢిల్లీ వెళ్తామని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తాము సమైక్య రాష్ట్రాన్ని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

రాష్ట్ర విభజన వల్ల రాయలసీమ ఎక్కువగా నష్టపోతుందని ఆయన అన్నారు. 2014 ఎన్నికల లోగా తెలంగాణ అంశంపై నిర్ణయం తీసుకోవడం సాధ్యం కాదని ఆయన అన్నారు. ఇసుక మాఫియా రాష్ట్రంలో సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతోందని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన విషయంలో తెలుగుదేశం రాయలసీమ ప్రాంత నేత బైరెడ్డి రాజశేఖర రెడ్డి వ్యాఖ్యలను ఆయన సమర్థించారు. రాష్ట్రం కలిసి ఉంటేనే అభివృద్ధి సాధ్యమని ఆయన అన్నారు.

సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు అడ్డుకున్నా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఆగేది కాదని కాంగ్రెసు సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అన్నారు. తెలంగాణపై కాంగ్రెసు అధిష్టానం సుదీర్ఘ కసరత్తే చేసిందని ఆయనతో పాటు ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, అమోస్ అన్నారు. అతి త్వరలోనే రాష్ట్ర విభజన సమస్యకు పరిష్కారం లభిస్తుందని వారన్నారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై సంప్రదింపులు అవసరం లేదని పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఆయన డిసెంబరు తొమ్మిదో తేదీ ప్రకటనతోనే రాష్ట్ర విభజనపై నిర్ణయం జరిగిపోయిందన్నారు. అందువల్ల ఇకపై ప్రత్యేకంగా ఇరు ప్రాంతాల నేతలతో మళ్లీ సంప్రదింపులు చేపట్టాల్సిన అవసరం లేదన్నారు.

దేశంలో చిన్న రాష్ట్రాల ఏర్పాటుతో నక్సలిజం సమస్య పెరుగుతుందని కేంద్ర హోంమంత్రి షిండే చేసిన వ్యాఖ్యలను పాల్వాయి ఖండించారు. నక్సలిజం తెలంగాణలో కంటే ఆంధ్రలోనే ఎక్కువగా ఉందనే విషయాన్ని గతంలో గవర్నర్‌గా పని చేసిన షిండేనే ప్రకటించిన విషయాన్ని పాల్వాయి గుర్తు చేశారు.

చిన్న రాష్ట్రాల ఏర్పాటుతో నక్సలిజం సమస్య ఉత్పన్నమవుతుందనే చెప్పారే గానీ.. తెలంగాణ ఇవ్వమని ఎక్కడా చెప్పలేదన్నారు. తెలంగాణ ప్రజలను సీమాంధ్ర మీడియా తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. రాష్ట్ర విభజనకు హద్దులు గుర్తించాల్సిన అవసరం లేదన్నారు.

English summary
Minister from Rayalaseema TG Venkatesh said that decision on Telangana issue before 2014 election is not possible. Congress Rajyasabha member Palwai Govardhan Reddy said that statehood for Telangana will not be stopped.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X