అప్పుడే ఓటీటీలోకి రానున్న దృశ్యం 3..? స్ట్రీమింగ్ ఎప్పుడంటే.. ?
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, క్రియేటివ్ డైరెక్టర్ జీతూ జోసెఫ్ కాంబినేషన్ లో తెరకెక్కిన థ్రిల్లర్ మూవీ దృశ్యం 3. అనుకోకుండా చిక్కుల్లో పడిన ఓ సామాన్య కుటుంబం.. ఆ సమస్యల నుంచి బయట పడేందుకు ఏం చేసింది అనేదే స్టోరీ లైన్ మొదటగా 2013 లో ఈ దర్శకుడు దృశ్యం సినిమాను తెరకెక్కించాడు. అయితే ఆ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించిన నేపథ్యంలో దానికి సీక్వెల్ గా 2021 లో దృశ్యం 2 సినిమాను తెరకెక్కించారు. అది కూడా సూపర్ హిట్ కావడంతో ఇప్పుడు దృశ్యం 3 తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ కథను థ్రిల్లింగ్ గా సస్పెన్స్, ట్విస్టులతో రూపొందించి మరో బ్లాక్ బస్టర్ సాధించారు మేకర్స్. దృశ్యం మూవీ రెండు పార్ట్ లు మాదిరిగానే ఈ మూవీ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకూ ట్విస్టులతో చాలా అద్భుతంగా ఉంది. ఈ మూవీ ఇప్పుడు థియేటర్లలో రికార్డు స్థాయిలో కలెక్షన్లు రాబడుతోంది.
దృశ్యం 3 మూవీ రిలీజైన కేవలం 3 రోజుల్లోనే రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ నమోదు చేసింది. మోహన్ లాల్ కెరీర్ లో అత్యధిక వసూళ్లు సాధించిన L2 ఎంపురాన్ (రెండు రోజుల్లో రూ. 32.10 కోట్ల గ్రాస్) రికార్డును ఇది అధిగమించకపోయింది. కానీ ఆయన లేటెస్ట్ చిత్రాలైన తుడరుమ్ (రెండు రోజుల్లో రూ. 14.30 కోట్లు), హృదయపూర్వం (రూ. 5.75 కోట్లు) కంటే ఎక్కువ వసూళ్లు దక్కించుకుంది. ఈ మూవీ ఇక లాంగ్ రన్ లో ఎలాంటి రికార్డుల్ని నమోదు చేస్తుందో చూడాల్సి ఉంది. అయితే ఇప్పుడు దృశ్యం 3 మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి అడుగు పెడుతుందా..? అని మూవీ లవర్స్ తెగ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

ప్రస్తుతం దృశ్యం 3 ఓటీటీ హక్కులను భారీ ధరకు స్వాధీనం చేసుకునేందుకు అమెజాన్ ప్రైమ్ వీడియో.. అలాగే నెట్ ఫ్లిక్స్ పోటీ పడుతున్నాయి. ఈ రెండు దిగ్గజ సంస్థలలో ఒకటి భారీ ధరకు డీల్ ముగించే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. ఇక సాధారణంగా ఏ పెద్ద సినిమా అయినా థియేటర్లలో విడుదలైన 4 నుంచి 6 వారాల తర్వాత ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లోకి వస్తాయి. ఈ లెక్కన చూసుకుంటే దృశ్యం 3 మూవీ కూడా త్వరలోనే ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది. దీనిపై త్వరలోనే స్పష్టత రానుంది. ఇప్పటికైతే దృశ్యం 3 మూవీ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితం అవుతోంది.












Click it and Unblock the Notifications