వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ ఇస్తే దేనికైనా రెడీ!: వాయలార్‌తో కెసిఆర్

By Srinivas
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రం సరేనంటే దేనికైనా సిద్ధమేనని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, కల్వకుంట్ల చంద్రశేఖర రావు సోమవారం కేంద్రమంత్రి వాయలార్ రవితో చెప్పారని సమాచారం. వాయలార్ ఇంటికెళ్లిన కెసిఆర్ ఆయనతో దాదాపు 45 నిమిషాలు మాట్లాడారు. ఈ సందర్భంగా కెసిఆర్ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని రవికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఏర్పాటుకు కేందర్ం సై అంటే తాము ఏ ప్రతిపాదనకైనా సిద్ధమేనని చెప్పారని తెలుస్తోంది.

హైదరాబాద్ విషయంలో తాము మొదటి నుండి చేస్తున్న ప్రతిపాదనకే కట్టుబడి ఉన్నామని, సీమాంధ్ర నేతల ఒత్తిళ్లకు తలొగ్గి ఎలాంటి తెలంగాణ వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవద్దని, అలా తీసుకుంటే సహించేది లేదని చెప్పారని సమాచారం. నెలాఖరులోగా రాష్ట్ర విభజన ప్రకటన చేయాలని లేదంటే ఇప్పటికే ప్రకటించినట్లుగా తెలంగాణ మిలియన్ మార్చ్‌ భారీ ఎత్తున నిర్వహిస్తామని, రాయల తెలంగాణకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకొనేది లేదని చెప్పారు.

హైదరాబాదును కొన్నాళ్లు ఉమ్మడి రాజధానిగా ఉంచి ఆతర్వాత తెలంగాణ రాజధానిగా చేసే అంశానికి కెసిఆర్ ఓకే చెప్పారని సమాచారం. కాగా సమైక్యాంధ్రలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయం గురించి కెసిఆర్ వాయలార్ రవికి నివేదిక ఇచ్చారు. కెసిఆర్ వ్యాఖ్యలు సావధానంగా విన్న రవి అన్ని అంశాలను పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, కాంగ్రెసు కోర్ కమిటీ సభ్యులకు వివరిస్తానని తెలిపారు.

బేటీ అనంతరం వాయలార్ రవి మాట్లాడుతూ... తెలంగాణ ఏర్పాటును కోరుతున్న కెసిఆర్ అదే విషయమై మాట్లాడేందుకు తనను కలిశారని, తెలంగాణ ఏర్పాటుపై సత్వరమే నిర్ణయం తీసుకోవాలని కోరారని చెప్పారు. రాష్ట్రంలో పరిణామాలను గురించి ఆయన వివరించారని, ఆయన చెప్పిన విషయాలను పూర్తిగా విన్నానని తెలిపారు.

English summary
Telangana Rastra Samithi president K Chandrasekhar Rao met central minister Vayalar Ravi on Monday in New Delhi and talk about Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X