వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ బెయిల్ కోసం మూడు ఒప్పందాలు: యనమల

|
Google Oneindia TeluguNews

Yanamala Ramakrishnudu
హైదరాబాద్: వైయస్ జగన్ బెయిల్ కోసం కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల మధ్య రెండు ఒప్పందాలు జరిగాయని, దానివల్లనే సిబిఐ దర్యాప్తులో కేంద్ర న్యాయశాఖ జోక్యం చేసుకుంటోందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ఇరు పార్టీల మధ్య మూడు ఒప్పందాలు కుదిరాయని, అందుకు కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ మధ్యవర్తిత్వం వహిస్తున్నారని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.

తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై కొత్త కేసులు పెట్టడదం, కాంగ్రెసులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విలీనం, వైయస్ జగన్ అక్రమాస్తుల కేసును నీరుగార్చడం ఆ మూడు ఒప్పందాలని ఆయన చెప్పారు. లేకుంటే జగన్ బెయిల్‌పై కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు ఆసక్తి అని ఆయన అడిగారు. వైయస్ జగన్ కేసులో న్యాయవాదులను మార్చుకోవాలని న్యాయశాఖ సిబిఐకి సూచించిందని, సిబిఐ దర్యాప్తులో న్యాయ శాఖ జోక్యం చేసుకుంటోందని ఆయన అన్నారు.

వైయస్ జగన్‌ను కాపాడేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు. వైయస్ జగన్‌కు న్యాయశాఖ సహకరిస్తోందని ఆయన అన్నారు. అహ్మద్ పటేల్, కేంద్ర న్యాయశాఖ మంత్రి వీరప్ప మొయిలీ ఆదేశాల మేరకు సిబిఐ న్యాయవాదులను మార్చే ప్రయత్నం చేస్తోందని ఆయన విమర్శించారు. రాష్ట్రపతి ఎన్నికలో ప్రణబ్ ముఖర్జీకి వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఓటేయడం అందులో భాగమేనని ఆయన అన్నారు.

వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో జారీ అయిన జీవోల వల్ల వైయస్ జగన్ సంపద కూడగట్టుకున్నారని, జగన్ కంపెనీల్లోకి పెట్టుబడులు వచ్చాయని ఆయన అన్నారు. వైయస్ విజయమ్మ ప్రకటనలు, పరిణామాలు చూస్తుంటే కాంగ్రెసులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విలీనమవుతుందనేది తెలిసిపోతూ ఉందని ఆయన అన్నారు. వైయస్ జగన్ అస్తుల కేసులో ఇరుక్కుని ధర్మాన ప్రసాద రావు చేసిన రాజీనామా పెండింగులోనే ఉందని ఆయన అన్నారు.

తెలంగాణపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తన వైఖరి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ ప్రకటన చూస్తుంటే పదవుల కోసం వచ్చినట్లు కనిపించడం లేదని, సామాన్య కార్యకర్తగానే కొనసాగేందుకు సిద్ధపడినట్లు తెలుస్తోందని ఆయన అన్నారు. చంద్రబాబు పాదయాత్రపై రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని ఆయన అన్నారు.

English summary
Telugudesam senior leader Yanamala Ramakrishnudu alleged that YSR Congress has came inti agreement with Congress to get bail to YS Jagan. It is clear with the law ministry intervention in CBI probe that two parties have come into an understanding, he told.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X