విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎన్టీఆర్, లోకేష్ క్రమశిక్షణ గల కార్యకర్తలు: రేవంత్

By Pratap
|
Google Oneindia TeluguNews

Revanth Reddy
విజయవాడ: సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్, తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడి కుమారుడు నారా లోకేష్ క్రమశిక్షణ గల పార్టీ కార్యకర్తలను తెలుగుదేశం పార్టీ శానససభ్యుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన గురువారం విజయవాడ ఫ్లైఓవర్ నిర్మాణం కోసం జరిగిన పార్టీ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. నారా లోకేష్ పార్టీలోకి రావడాన్ని స్వాగిస్తున్నట్లు ఆయన తెలిపారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మపై, కాంగ్రెసు విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్‌పై ఆయన ధర్నా కార్యక్రమంలో ప్రసంగిస్తూ తీవ్రంగా ధ్వజమెత్తారు.

వైయస్ జగన్ జైలు నుంచి వస్తాడని వైయస్ విజయమ్మ చెబుతున్నారని, దేశం కోసం పోరాడి జగన్ ఏమైనా జైలుకు వెళ్లాడా అని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఓట్లేస్తే అందరినీ జగన్ జైలుకు తీసుకుని వెళ్తాడా అని ఆయన ప్రశ్నించారు. తమ పార్టీ అధ్యక్షుడు ఎక్కడ ఉంటారంటే ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో ఉంటాడని చెప్పగలమని, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఏం చెప్పుకుంటుందని ఆయన అన్నారు. జైలుకు వెళ్లడానికి జగన్ ఏం చేశాడని ఆయన వైయస్ విజయమ్మను ప్రశ్నించారు. జగన్ నాయకత్వంలో పనిచేసే అవకాశం లభించడం తన అదృష్టమని గుడివాడ శాసనసభ్యుడు కొడాలి నాని అనడాన్ని ఆయన ఎద్దేవా చేశారు.

జగన్ వీరుడా, శూరుడా అని ఆయన అడిగారు. నాని వంటివాళ్లు పోవడం వల్లనే తెలుగుదేశం పార్టీ బాగు పడుతుందని ఆయన అన్నారు. తమ పార్టీకి నాయకులు కన్నా కార్యకర్తలు ముఖ్యమని, తమది కార్యకర్తల పార్టీ అని ఆయన అన్నారు. నక్క వినయాల నానిని భూస్థాపితం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. 2004, 2009 ఎన్నికల్లో నాని వంటి అవకాశవాదులకు టికెట్లు ఇవ్వడం వల్లనే పార్టీ నష్టపోయిందని ఆయన అన్నారు. నాని కుక్క తోలు కప్పుకున్న నక్క అని ఆయన వ్యాఖ్యానించారు.

విజయవాడ ఫ్లైఓవర్ నిర్మాణంపై లగడపాటి రాజగోపాల్ ఎందుకు మాట్లాడడం లేదని ఆయన ప్రశ్నించారు. విజయవాడ ఫ్లై ఓవర్ కోసం అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన చెప్పారు. భవానీ ద్వీపాన్ని చిరంజీవి కబ్జా చేస్తుంటే లగడపాటి ఎందుకు మాట్లాడడం లేదని ఆయన అడిగారు. లగడపాటి రాజగోపాల్ హైదరాబాద్‌లో జోకర్, ఢిల్లీలో బ్రోకర్ అని ఆయన వ్యాఖ్యానించారు. విజయవాడ సమస్యలపై పోరాటం చేస్తామని ఆయన చెప్పారు.

తెలంగాణపై సీమాంద్ర, తెలంగాణ ప్రాంతాలకు చెందిన పార్టీ నాయకుల మధ్య అభిప్రాయభేదాలు లేవని ఆయన చెప్పారు. తెలంగాణపై చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని ఆయన చెప్పారు.

English summary
Telugudesam MLA Revanth Reddy said that cine hero Nara Lokesh and party president N Chandrababu Naidu's son Nara Lokesh are disciplined party worker. He invited the political entry of Nara Lokesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X