హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మందకృష్ణ మాదిగ దీక్ష భగ్నం: వికలాంగుల ధర్నా

By Pratap
|
Google Oneindia TeluguNews

Manda Krishna Madiga
హైదరాబాద్: మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీయస్) వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ దీక్షను భగ్నం చేశారు. ఆరోగ్యం విషమించడంతో పోలీసులు శుక్రవారం ఆయనను అరెస్టు చేసి, హైదరాబాదు మలక్‌పేటలో గల యశోదా ఆస్పత్రికి తరలించారు. వికలాంగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆయన గత నాలుగు రోజులుగా హైదరాబాదులోని మవర్‌పేటలో దీక్ష చేస్తున్నారు.

పోలీసులను అడ్డుకునేందుకు కార్యకర్తలు ప్రయత్నించారు. వారిని పోలీసులు అరెస్టు చేసి, మందకృష్ణను ఆస్పత్రికి తరలించారు. కాగా, మందకృష్ణ మాదిగ అరెస్టుకు నిరసనగా వికలాంగులు నల్లగొండ చౌరస్తా వద్ద ఆందోళనకు దిగారు. వారిని పోలీసులు చెదరగొట్టారు.

వికలాంగుల డిమాండ్ల సాధన కోసం మూడు రోజులుగా దీక్ష చేస్తున్నా ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడాన్ని నిరసిస్తూ తన దీక్షను ఆమరణ దీక్షగా కొనసాగిస్తున్నట్లు వికలాంగుల హక్కుల పోరాటసమితి వ్యవస్థాపకులు మంద కృష్ణ మాదిగ గురువారం ప్రకటించారు.

ప్రభుత్వ నిర్లక్ష్యవైఖరిని ఎండగడుతూ శుక్రవారం నుంచి 48 గంటల పాటు రాష్ట్రవ్యాప్తంగా రహదారులు దిగ్బంధం చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. మంద కృష్ణ దీక్ష శుక్రవారం నాలుగో రోజుకు చేరింది. ఆ స్థితిలో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని, ఆస్పత్రికి తరలించారు.

English summary

 MRPS leader Manda Krishna Madiga has been arrested and shifted to Malakpet Yasoda hospital. He is on fast for last four days on physically handicapped problems
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X