గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రేప్ కేసులో ఇద్దరు పోలీసుల అరెస్టు, సిఐడి వెల్లడి

By Pratap
|
Google Oneindia TeluguNews

Guntur Map
హైదరాబాద్: వివాహితపై అత్యాచారం జరిపిన కేసులో సిఐడి అధికారులు ఇద్దరు పోలీసులను అరెస్టు చేశారు. అత్యాచారానికి పాల్పడిన కానిస్టేబుల్ ఓర్సు వెంకటేష్‌ను బుధవారం అరెస్టు చేసినట్లు సిఐడి తెలిపింది. ఈ మేరకు సిఐడి అదనపు డిజి రమణమూర్తి గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. అతనికి సహకరించాడనే ఆరోపణలపై గుంటూరు జిల్లా వినుకొండ పోలీసు స్టేషన్‌లో స్పెషల్ పోలీసు ఆఫీసర్‌గా పనిచేస్తున్న ఎస్‌కె దాస్‌ను కూడా అరెస్టు చేశారు.

వీరిద్దరిని న్యాయస్థానంలో హాజరుపరిచి జైలుకు తరలించినట్లు రమణమూర్తి చెప్పారు. బాధిత మహిళది గుంటూరు జిల్లా వినుకొండ రెండో లైనులో మసీదు మన్యం ప్రాంతం. ఆమె భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. అప్పటి వినుకొండ ఎస్ఐ గన్‌మన్‌గా పనిచేస్తున్న ఓర్సు వెంకటేష్ విచారణకని వెళ్లి 2010 జులై 13వ తేదీ అర్థరాత్రి బాధిత మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఆ ఘటనపై వినుకొండ పోలీసు స్టేషనులో కేసు నమోదైంది. అయితే విచారణ చేయకుండానే పోలీసులు కేసును మూసివేసినట్లు సిఐడి దర్యాప్తులో వెల్లడైంది. నేరం జరిగినట్లు ఫోరెన్సిక్ నివేదికలో తేలడంతో సిఐడి పోలీసులు ఓర్సు వెంకటేష్‌ను అరెస్టు చేశారు. ప్రస్తుతం అతను గుంటూరు జిల్లా క్రోసూరు పోలీసుల స్టేషనులో పనిచేస్తున్నాడు. అతడికి సహకరించాడనే ఆరోపణపై దాస్‌ను సర్వీసు నుంచి తొలగించారు.

తప్పుడు ఫిర్యాదు ఇచ్చావంటూ బాధిత మహిళను ప్రాసిక్యూట్ చేసే దాకా స్థానిక పోలీసులు వెళ్లినట్లు తెలుస్తోంది. మహిళను అధికారాన్ని అడ్డం పెట్టుకుని బెదిరించి అత్యాచారానికి దిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.

English summary
Two policemen including a special officer have been arrested by the CID in connection with a 2010 rape case in Guntur district of Andhra Pradesh. The case, which was registered two years ago and later closed by Venukonda police in Guntur was re-investigated by CID which established the rape of a married woman by constable Orsu Venkatesh with the help of SPO Saida, who prevented the victim's husband to rescue her.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X