త్వరలో తెలంగాణపై నిర్ణయం, నేనూ చెప్పా: కిరణ్

ఒకరు తెలంగాణపై ప్రశ్నించగా.. కేంద్రం తెలంగాణపై త్వరలో నిర్ణయాన్ని వెల్లడిస్తుందని చెప్పారు. తెలంగాణపై పార్టీ తరఫున స్పష్టమైన నిర్ణయాన్ని సాధ్యమైనంత త్వరగా ప్రకటించాలని తాను కూడా పార్టీ అధిష్టానాన్ని కోరినట్లు కిరణ్ చెప్పారు. పాలమూరు విశ్వవిద్యాలయానికి రూ.15 కోట్లు మంజూరు చేస్తున్నట్లు కిరణ్ ప్రకటించారు. తమ ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఈ సంవత్సరం రాష్ట్రంలో 3.2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని కిరణ్ చెప్పారు.
కాగా శనివారం కూడా కిరణ్ తెలంగాణ అంశంపై స్పందించారు. తెలంగాణపై కేంద్రంలో జరగాల్సిన పని జరుగుతోందని, ఎవరు ఆందోళన చేయాల్సిన అవసరమే లేదని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. పేదలకు అందించాల్సిన సంక్షేమ పథకాలను పరిశీలించాల్సిన బాధ్యత తనపై ఉందని, తెలంగాణ కావాలంటూ ఆందోళనలు చేస్తే ఎక్కడ ఉన్న తెలంగాణ అక్కడే ఉంటుందని హితవు పలికారు. తెలంగాణపై జరగాల్సిన పనిని కేంద్రం జరిపిస్తూనే ఉందని, త్వరలోనే కీలక నిర్ణయం రానుందని ముఖ్యమంత్రి వెల్లడించారు.












Click it and Unblock the Notifications