మార్పు గాలి వార్త, హ్యాపీగా ఉందన్నారు: టిజి వెంకటేష్

కిరణ్‌ను మార్చి తెలంగాణ ప్రాంతానికి చెందిన జైపాల్ రెడ్డిని ముఖ్యమంత్రి చేస్తారనే వార్తలు సరికాదన్నారు. పార్టీలో ముఖ్యమంత్రి పదవిని ఎవరూ కోరుకోవడం లేదన్నారు. 2014 ఎన్నికల వరకు ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డియే కొనసాగుతారన్నారు. ముఖ్యమంత్రి మార్పు అనేది అసత్య ప్రచారమని న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి అన్నారు.
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన పాదయాత్రతో సాధించేది ఏమీ లేదన్నారు. చంద్రబాబు సరిగా ఉంటే తెలుగుదేశం పార్టీకి ఈ గతి ఎందుకు పడుతుందన్నారు. రాష్ట్రంలో పార్టీ పూర్తిగా తన ప్రాబల్యం కోల్పోయిందన్నారు. చంద్రబాబును, ఆ పార్టీని ప్రస్తుతం రాష్ట్రంలో ఎవరూ నమ్మడం లేదన్నారు. బాబు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. కిరణ్ నాయకత్వంలోనే సాధారణ ఎన్నికలు జరుగుతాయన్నారు.
చంద్రబాబు అసెంబ్లీలో ఉన్నప్పుడు ప్రజల్లో చూసుకుంటానని, బయట ఉన్నప్పుడు అసెంబ్లీలో చూసుకుంటానని చెబుతారని.. కానీ ఆయన ఎక్కడా చూసుకునేది లేదని ఏరాసు ఎద్దేవా చేశారు. టిడిపికి ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి లేదని ప్రభుత్వం చీఫ్ విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి వేరుగా అన్నారు. ప్రతిపక్షాల కోరిక మేరకే సమావేశాలను 5 రోజులు పెంచినట్లు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ సబ్ కమిటీ ప్లాన్ పైన మరోసారి సమావేశమవుతామన్నారు. విపక్షాలు బాధ్యతతో ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలని, కానీ బైకాట్ చేయడం సరికాదన్నారు.












Click it and Unblock the Notifications