అసభ్య ఫోటోలు తీసి బ్లాక్‌మెయిల్: ప్రియుడిపై ఫిర్యాదు

వేధింపులతో ఆత్మహత్య
నల్గొండ జిల్లా సూర్యాపేటలో యువకుడి వేధింపులతో విసుగు చెందిన ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. సూర్యాపేటలో ఇంటర్ చదువుతున్న రేణుక అనే విద్యార్థినిని ఫరీజ్ అనే విద్యార్థి ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. అతని వేధింపులను తట్టుకోలేక ఆమె ఈ రోజు ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పు అంటించుకుంది. ఆమె తీవ్రంగా గాయపడింది.
దీంతో కుటుంబ సభ్యులు, స్థానికులు ఆమెను సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. రేణుక చికిత్స పొందుతూ మృతి చెందింది. ఫరీజ్ అనే యువకుడి వేధింపుల వల్లనే తమ కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పోలీసులు విచారిస్తున్నారు.












Click it and Unblock the Notifications