చంద్రబాబు పాదయాత్ర చేస్తే..., ఆ అవసరం లేదు: రోజా

Roja
చిత్తూరు: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మహిళ నేత, ప్రముఖ నటి రోజా ఆదివారం మరోసారి విరుచుకు పడ్డారు. చంద్రబాబు రాష్ట్రాన్ని తొమ్మిదేళ్లు పాలించారని, ఆ సమయంలో వర్షాలు పడక రైతులు తీవ్ర కరువు కాటకాలు ఎదుర్కొన్నారని అన్నారు. ఇప్పుడు చంద్రబాబు ప్రజా సమస్యల కోసం అంటూ పాదయాత్ర చేస్తే పొలాలు ఇప్పుడు బీడుగా మారిపోతాయని విమర్శించారు.

కాంగ్రెసుతో జత కట్టాల్సిన అవసరం తమకు ఎంతమాత్రమూ లేదని రోజా అన్నారు. తమ పార్టీని, తమ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేకనే తెలుగుదేశం పార్టీయే కాంగ్రెసు పార్టీతో కుమ్మక్కు అయిందన్నారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికలలో కాంగ్రెసు, టిడిపిలు కుమ్మక్కయ్యాయని, అందుకే ఆ పార్టీలు రెండు కొన్ని నియోజకవర్గాలలో డిపాజిట్లు దక్కించుకున్నాయన్నారు. కాంగ్రెసుతో జతకట్టిన టిడిపి తమపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.

కాగా అంతకుముందు పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ హైదరాబాదులో మాట్లాడుతూ ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. తమ పార్టీని విలీనం చేయాల్సిన అవసరం మాకుందా అని ఆమె మీడియాను ప్రశ్నించారు. కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నిశ్చితార్థం అయిపోయిందని, త్వరలో పెళ్లి జరగనుందని వ్యాఖ్యానించిన తెలుగుదేశం పార్టీ నేతల వ్యాఖ్యలను మీడియా విజయమ్మను ప్రశ్నించింది.

అందుకు ఆమె.. తమ పార్టీకి విలీనం అవసరమా అని మీడియాను ఎదురు ప్రశ్నించారు. ఉప ఎన్నికలలో తమ పార్టీని ప్రజలు అత్యంత మెజార్టీతో గెలిపించారని, అలాంటి ప్రజలను తాము మోసం చేయమన్నారు. రాష్ట్ర ప్రజల అభిమానాన్ని చూరగొంటున్న తమ పార్టీకి విలీనం అవసరమని మీరు భావిస్తున్నారా అని, ఏ ఒక్కరైనా విలీనం అవసరమని చెప్పగలరా అని విజయమ్మ అన్నారు. తన తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కోసం విలీనం అవుతుందన్న వ్యాఖ్యలను కూడా ఆమె కొట్టిపారేశారు. జగన్ జైలుకు వెళ్లి తొంబై రోజులు దాటిందని, అలాంటప్పుడు న్యాయపరంగా బెయిల్ వస్తుందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+